చిరు సినిమాలో అనుసూయ.. సింపేస్తుందట!


యాంకర్ అనసూయ.. ఇప్పుడు బిజీబిజీగా గడుపుతోంది. ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై వరుస అవకాశాలతో అసలు ఏది వదులుకోవాలో.. దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో కూడా ఈ హాట్ పాపకు దిక్కుతోచట్లేదట. వెండితెరపై ‘రంగమ్మత్త’ ఓ వెలుగు వెలిగిన ఈమెకు నాటి నుంచి నేటి వరకూ అవకాశాలకు కొదవలేదు. అంతేకాదు.. ఈమె లేడీ ఓరియెంటెడ్ పాత్రలో సైతం నటించి మెప్పించింది. ఇవన్నీ ఓ ఎత్తయితే ఈ ముద్దుగుమ్మ కోసమే కొన్ని కొన్ని పాత్రలు డైరెక్టర్లు రాస్తున్నారంటే రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఈ హాట్ అనుకు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో 152వ చిత్రం ‘ఆచార్య’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా సెట్స్‌పైకి వెళ్లగా కరోనా ప్రభావంతో మళ్లీ బ్యాక్ టూ హోమ్ అంటూ చిత్రబృందం ఇంటికే పరిమితమైంది. ఈ క్రమంలో లెక్కలేనన్ని పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలోనూ పుకార్లు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికే హీరోయిన్ విషయం మొదలుకుని యంగ్ మెగాస్టార్ పాత్ర వరకూ ఇలా చాలానే రూమర్స్ వచ్చాయ్. అయితే సినిమా యూనిట్ వీటికి స్పందించకపోవడంతో రోజురోజుకూ పుకార్లు పెరిగిపోతున్నాయ్. తాజా ఈ పుకార్ల జాబితాలోకి హాట్ యాంకర్ అనసూయ కూడా చేరిపోయింది.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ హాట్ భామను ఓ స్పెషల్ సాంగ్‌ కోసం కొరటాల తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాస్తవానికి ఇప్పటికే స్పెషల్ సాంగ్‌లో రెజీనా నటిస్తున్నట్లు కన్ఫామ్ కూడా అయిపోయింది. అయితే ఇంటర్వెల్‌కు ముందు ఓ ఐటమ్.. తర్వాత ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుందట. అందుకే అనును ఇంటర్వెల్ తర్వాత సాంగ్‌ తీసుకున్నారట. ఈ సాంగ్‌తో సినీ ప్రియులు ముఖ్యంగా మెగాభిమానులను మంచి మసాలా ఇస్తుందట. ఒక్క మాటలో చెప్పాలంటే సాంగ్‌లో అను సింపేస్తుందట. కాగా.. ఇప్పటికే అనుతో దర్శకనిర్మాతలు మాట్లాడగా.. వై నాట్ సార్.. ఐ యామ్ రెడీ అని చెప్పిందట. 

ఇప్పటికే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్తగా.. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ హాట్ హాట్ అందాలు ఆరబోసిన అను.. ఈసారి మెగాస్టార్ అందాలు ఆరబోస్తోందన్నమాట. ఈ మధ్య మెగా హీరోల సినిమాల్లో చిన్నపాటి పాత్ర వచ్చినా చాలు అస్సలు మిస్ కాకుండా అను నటిస్తోంది.. నర్తిస్తోంది కూడా.! తాజా పుకార్లలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి  చూడాల్సిందే మరి.

Hot Anchor Anasuya In Megastar Chiru Acharya Movie!:

Hot Anchor Anasuya In Megastar Chiru Acharya Movie!  
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES