Advertisement
Google Ads BL

కరోనా నేపథ్యంలో మహేశ్ ‘ఆరు’ గోల్డెన్ రూల్స్!


కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంటే.. ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ ఉండనుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే.. మహేశ్‌ తమ అభిమానులు, యావత్ ప్రజానికానికి పలు జాగ్రత్తలు చెప్పిన ఆయన.. ఉగాది సందర్భంగా తాజాగా మరో ఆరు గోల్డెన్ రూల్స్ చెప్పారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో కరోనా వైరస్ నిర్మూలించడం గురించి మీ అందరికీ ఈ ఆరు విలువైన నియమాలను పాటించమని  కోరుతున్నాను.

గోల్డెన్స్ రూల్స్ ఇవే...

1:- మొదటిది, అతి ముఖ్యమైనది ఇంట్లోనే ఉండండి. ఏదో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.

2:- ఏదైనా తాకితే కనీసం 20/30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి.

3:- మీ ముఖాన్ని,  ముఖ్యంగా కళ్ళు, నోరు మరియు ముక్కును తాకకుండా ఉండండి. మీ నోటిని, ముఖాన్ని, ముక్కుని తాకవద్దు.

4:- దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి.

5:- సామాజిక దూరం యొక్క అవసరాన్ని అర్థం చేసుకుని.. మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.

6:- మీకు కరోనా లక్షణాలు లేదా అనారోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్‌ని వాడండి. మీకు కోవిడ్-19 లక్షణాలుంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండి. అంతేకాదు.. మంచి సోర్స్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. కరోనాపై అందరితో కలిసి పోరాడి జయిద్దాం అని మహేశ్ వరుస ట్వీట్స్ చేశాడు.

ఇదివరకే.. సామాజిక దూరం పాటించడమే దీనికి సరైన ‘మందు’ అని మహేశ్ బాబు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని.. సామాజిక దూరం పాటించడం ఇప్పుడు చాలా అవసరమని ఇదివరకే సూపర్ స్టార్ తెలిపాడు.

Mahesh 6 Golden Rules Over Corona Virus!:

Mahesh 6 Golden Rules Over Corona Virus!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs