కరోనా కారణంగా జనాలంతా ఇళ్ళకే పరిమితం అయిపోయి ఒకానొక నైరాశ్యంలో మునిగిపోయారు. ఏ వార్త చూసినా కరోనా గురించే. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా అది కరోనా గురించే ఉంటుంది. ఇంటి దగ్గర కూర్చుని సినిమా చూద్దామన్న కూడా కుదరడం లేదు. మార్చ్ 31 వరకే లాక్ డౌన్ అనుకుంటే ఇప్పుడు ప్రధాని మోదీ దాన్ని మరింతగా పొడిగించాడు.
ఏప్రిల్ 14 వరకి ఇళ్ళకే పరిమితం కావాలని ఆదేశాలు జారీచేశాడు. కరోనాని అడ్డుకోవాలంటే ఇళ్లకే పరిమితం కావడం తప్ప మరో మార్గం లేనటువంటి ఇలాంటి టైమ్ లో జనాలందరూ చేసేది ఏమీలేక ఇళ్లలోనే ఉండిపోతున్నారు. వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఇలాంటి టైమ్ లో మనలో పెరుగుతున్న డిప్రెషన్ ని తగ్గించి మళ్ళీ ఆశలు రేపడానికి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగోని రిలీజ్ చేశాడు.
టైటిల్ లోగోని రిలీజ్ చేస్తానని చెప్పినప్పటి నుండి అందరిలో ఒకరకమైన ఉత్సాహం కలిగింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తాడా.. ఎప్పుడు చూద్దామా అని అనుకుంటున్న వాళ్ళ కోసం వచ్చేసింది ఆర్ ఆర్ ఆర్ టైటిల్.. నీరు, నిప్పు కలిస్తే వచ్చే శక్తే ఈ ఆర్ ఆర్ ఆర్ అంటూ రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
ఈ మోషన్ పోస్టర్ చూసిన ప్రతీ ఒక్కరికీ కొత్త శక్తేదో వచ్చినట్లైంది. థియేటర్లు మూతబడి, షూటింగులు క్యాన్సిల్ అయి ఏమీ చేయాలో అర్థం కాక ఒకవిధమైన నిరాశలో కొట్టుకుపోతున్న జనానికి మళ్లీ ఆశలు రేకెత్తించిన రాజమౌళికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే..