Advertisement
Google Ads BL

రాజమౌళి కత్తిరించడం స్టార్ట్ చేశాడట..?


బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులు వాయిదా పడింది. దాంతో చిత్రబృందం అంతా ఇంటికే పరిమితమైపోయారు. కరోనా కల్లోలం ఎన్ని రోజులు ఉంటుందో తెలియని నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రంలోని మెయి ఎపిసోడ్స్ తో పాటు, ఇంకా హీరోయిన్లు షూటింగ్ లో పాల్గొనకపోవడంతో అనుకున్న సమయానికి ఆర్ ఆర్ ఆర్ రావడం కష్టమే అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ విషయంలో రాజమౌళి కూడా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అందుకే ఆర్ ఆర్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి.   ఎవరికి వారు ఇళ్ళలోనే ఉండమని చెప్పడంతో ఇంట్లోనే ఉండి ఆర్ ఆర్ ఆర్ ని కత్తిరించడం స్టార్ట్ చేసాడట.. మరి ఈ విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ రాజమౌళి తాను చెప్పిన సమయానికి ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలనే గట్టి పట్టుల్దతో ఉన్నాడట.

2021 జనవరి 8 వ తేదీని రిలీజ్ డేట్ గా ప్రకటించిన ఈ చిత్రం మొత్తం పది భాషల్లో విడుదల అవనుందట. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం, కన్నడలతో పాటుగా మరో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తారు. మరి ఆ మిగిలిన ఐదు భాషలు కూడా భారతీయ భాషలేనా అన్నది ఇంకా వెల్లడి చేయలేదు.

Rajamouli started RRR editing..?:

Rajamouli started RRR editing...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs