Advertisement
Google Ads BL

పవన్, దిల్ రాజుల కలలను మింగేసిన కరోనా!


పవన్ కళ్యాణ్ ఎలాగైనా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. కాస్త డబ్బు సంపాదించుకుందామనుకున్నాడు. అదే విషయం పవన్ కళ్యాణ్ అందరితో చెప్పాడు. తనకేమి ఆస్తులు, ఫ్యాక్టరీలు లేవని.. అందుకే సినిమాలు చేసుకుంటున్నా అని చెప్పాడు. అందుకే పింక్ రీమేక్ వకీల్ సాబ్ ని దిల్ రాజు నిర్మాతగా యమా ఫాస్ట్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కంప్లీట్ చెయ్యకుండానే క్రిష్ దర్శకత్వంలో సినిమా మొదలెట్టాడు. రెండు సినిమాలే కాదు.. హరీష్ తో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ తెగ సంపాదిద్దామనుకున్న పవన్ కి కరోనా చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్స్ బంద్ తో పవన్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి.

Advertisement
CJ Advs

ఇక దిల్ రాజు మార్చి 21 నుండి షూటింగ్ మొదలైతే చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాని ఎలాగైనా మే 15 కి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అందుకే వకీల్ సాబ్ ప్రమోషన్స్ విషయం కూడా లైట్ తీసుకున్నాడనే టాక్ నడిచింది. కాకపోతే వాయిదాపడే అవకాశం ఉందనే టాక్ వినబడింది. ఇక ప్రస్తుతం కరోనా పరిస్థితులను బట్టి వకీల్ సాబ్ పక్కా వాయిదా గ్యారెంటీ. కరోనా తాండవం ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు... సో పవన్ కల, దిల్ రాజు కల రెండూ మటాష్. కరోనా దెబ్బకి ఇద్దరు విలవిలలాడాల్సిందే.

Pawan Vakeel Saab Postponed for Corona:

Corona Effect on Pawan kalyan and Dil Raju Dreams 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs