Advertisement
Google Ads BL

కాజల్‌ను కోటిన్నరకి ఒప్పించిన చెర్రీ!?


మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సుమారు సగం సినిమాకు పైగా షూటింగ్ అవ్వాల్సి ఉండగా.. కరోనా దెబ్బతో షూటింగ్ అయిపోయింది.‘ఆచార్య’ ఒక్కటే యావత్ సినీ ఇండస్ట్రీ షూటింగ్స్, రిలీజ్‌లను ఆపేసింది. ఈ క్రమంలో దర్శకనిర్మాతలు ఇళ్లలో కూర్చోని వాట్ నెక్స్ట్ అంటూ ప్లాన్‌లు గీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే సీనియర్ బ్యూటీ త్రిష.. తాను చిరు సరసన చేయట్లేదని చెప్పిన తర్వాత ఇదిగో ఈ బ్యూటీని కన్ఫామ్ చేసేశారు.. అబ్బే కాదు ఆ బ్యూటీనే ఫిక్స్ చేసేశారు.. చిరు సరసన ఈ భామే.. చెర్రీ సరసన ఫలానా భామ ఇలా చిత్ర విచిత్రాలుగా వార్తలొచ్చేశాయ్. అంతేకాదు.. తాజాగా చిరు సరసన కాజల్ అని.. చెర్రీతో రష్మిక రొమాన్స్ చేయనుందని ఫైనల్‌గా వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

మొదట కాజల్‌ను అప్రోచ్ అవ్వగా.. రెండు కోట్లిస్తే తాను రెడీ అని లేకుంటే కష్టమేనని చెప్పిందట. అయితే.. కొండెక్కి కూర్చున్న కాజల్‌ను తిన్నగా బుజ్జగించి కోటిన్నరకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒప్పించాడట. వీరిద్దరూ (చెర్రీ) ఇద్దరూ కలిసి పనిచేసిన పరిచయం.. మరోవైపు చిరుతోనూ సినిమా చేసిన కాజల్.. చెర్రీ ఓ రేట్ ఫిక్స్ చేయగానే ఇక కాదనలేకపోయిందట. సో.. చిరు సరసన కాజలే అన్న మాట. ఈ వ్యవహారం అంతా అయిన తర్వాతే ఇటీవలే సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి లీక్స్ కూడా చేసిందట.

మొత్తానికి చూస్తే.. మెగాస్టార్ సరసన ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మరోసారి నటించనుందన్న మాట. అంటే రెండోసారి అమ్మడూ.. లెట్స్ డూ కుమ్ముడే..!. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించి లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేశాయ్. మంచు మోహన్ బాబు నటిస్తున్నారని.. చెర్రీ-మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ వివాదాలంటూ వచ్చిన పుకార్ల విషయాల్లో మాత్రమే చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. కానీ ఇలా రోజురోజుకు పెరుగుతున్న పుకార్లపై మాత్రం దర్శకనిర్మాతలు అస్సలు నోరు మెదపట్లేదు. మరి ఫైనల్‌గా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.

Finally Kajal agarwal One and Half Crore For Chiru Movie!:

Finally Kajal agarwal One and Half Crore For Chiru Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs