Advertisement
Google Ads BL

నిధీ.. ఏంటీ పుకార్లు.. ఎందుకిలా!?


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.. అందుకే దీన్ని ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఒకట్రెండు హిట్‌లు వస్తే చాలు ఇక ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అంతేకాదు.. తర్వాత సినిమాకు, ఆ తర్వాత సినిమాకు మరింత పారితోషికం తెగ పెంచేస్తుంటారు. తాజాగా.. ఇస్మార్ట్ శంకర్‌ మూవీతో పాపులరైన నిధి అగర్వాల్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌లో ముందు వరుసలోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో మంచి గుర్తింపే కాకుండా.. యూత్‌లో ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. అలా టాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ ముద్దుగమ్మకు ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయ్. 

Advertisement
CJ Advs

వరుస ఆఫర్లే కాదండోయ్.. అంతకు రెట్టింపు పుకార్లు కూడా వచ్చేస్తున్నాయ్. ఇప్పటికే చిత్ర విచిత్రాలుగా ఈ ఇస్మార్ట్ పోరీపై పుకార్లు రాగా.. తాజాగా పారితోషికం విషయంలో యమా వార్తలు వచ్చేస్తున్నాయ్. దీంతో అసలు ఏది నిజమో..? ఒకవేళ వార్తల్లో వచ్చేదే అక్షరాలా నిజామా..? అనేది తెలియక సినీ ప్రియులు తికమకపడుతున్నారు. ఇటీవలే.. తమిళ సినిమాలో ఐటెం సాంగ్‌లో చేయడానికి గాను.. అక్షరాలా అరవై లక్షలు ఇచ్చుకుంటేనే లేకుంటే అస్సలు కుదరుదని తేల్చిచెప్పేసిందని వార్తలు వినిపించాయి. అంత ఇచ్చుకోలేం.. మీరు అక్కర్లేదని సదరు దర్శకనిర్మాతలు ఆమె దండం పెట్టేశారని కూడా వార్తలు వినిపించాయి.

తాజాగా.. టాలీవుడ్‌లో ఓ ఐటెం సాంగ్ చేయడానికి ఈ బ్యూటీ 80 లక్షల రూపాయిలు డిమాండ్ చేసిందట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా రూపొందుతుండగా ఇందులో నభా నటేశ్ - అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. అయితే.. ఐటెం సాంగ్‌లో నటించాలని దర్శకనిర్మాతలు కోరగా రౌండ్ ఫిగర్ 80 అని చెప్పిందట. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ టైమ్ నడుస్తుండటం.. మరోవైపు అవసరం గనుక ఇచ్చుకోక తప్పదుగా.. కచ్చితంగా ఇస్తామని నిర్మాత చెప్పారట. ఇటీవలే తమిళ మూవీ విషయంలో అలా పుకార్లు రాగా.. తాజాగా ఇలా రూమర్స్ వస్తున్నాయ్.. మరి ఈ బ్యూటీ మీదే ఎందుకిలా వస్తున్నాయ్. ఇందులో నిజానిజాలెంతో అనేది తేలాలంటే నిధి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వాల్సిందే.

Why These Type of Rumours On Nidhi Agarwal!:

Why These Type of Rumours On Nidhi Agarwal!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs