టాలీవుడ్ ప్రేక్షకులకు అమీజాక్సన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఆమె చేసింది అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0లో ఈ బ్రిటీష్ బ్యూటీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఆ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన అమీ.. పెళ్లి కాకుండానే ప్రియుడితో గర్భం దాల్చింది. ఈ మధ్యే పండండి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే ఈ భామ అందాల ఆరబోత గురించి.. సోషల్ మీడియాలో షేర్ చేసే హాట్ హాట్ ఫొటోల లెక్కలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
దాదాపు పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి బ్యూటీ అయినా అందాల ఆరబోతకు పెద్దగా సాహసించదు. అయితే ఈ భామ మాత్రం అస్సలు తగ్గేదే లేదు.. కావాల్సి వస్తే డోస్ పెంచుతానే తప్ప తగ్గదే లేదన్నట్లుగా ఆరబోస్తోంది. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఇదిగో ఈ భామ మాత్రం ఇలా వీడియోలతో వర్కవుట్స్ చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది. వర్కవుట్స్ అంతా ఓకే గానీ ఈ ఆరబోతేంటి మేడమ్.. అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
యాష్ కలర్‌లో స్లీవ్‌లెస్ ఇన్నర్ వేర్ ధరించిన ఈ బ్యూటీ క్లీవేజ్ సొగసంతా బయటపెట్టేసింది. మరోవైపు.. రెండు చేతులూ కాస్త దగ్గరికి చేసి తన ఎద భాగాన్ని మరింత బహిర్గతమయ్యేలా చూపిస్తూ విమర్శలపాలైంది. అంతేకాదండోయ్ ఆ భామ ఏమో కళ్లు మూసుకుంటూ చేస్తూ.. నెటిజన్స్‌కి రెండు కళ్లూ మరింత పెద్దవిగా చేసి చూడమనేలా వీడియోలో ఉంది. అయితే ఆమె చేసే వర్కవుట్స్‌కు కొందరు ఫిదా కాగా.. అందాలకు ఫిదా అయినోళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నారు. సో.. దేనికైనా విమర్శలు, ప్రతి విమర్శలు కామన్.. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతే సరిపోద్ది అంతే. ఈ భామకు ఇలా అందాలు ఆరబోయటం ఇదేం కొత్త కాదు!.