Advertisement
Google Ads BL

రీమేక్-మల్టీస్టారర్ మూవీలో బాలయ్య, ఎన్టీఆర్!?


టాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్, మల్టీస్టారర్ ట్రెండ్ యమా నడుస్తోంది. రీమేక్ సినిమాల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో జనాలు అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఇలాంటి చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. దీంతో మల్టీస్టారర్ సినిమాలంటే చాలు సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా హీరోలు సిద్ధమైపోతున్నారు.. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ ప్రాజెక్ట్ సాగుతోంది కూడా.

Advertisement
CJ Advs

అయితే.. నందమూరి బాలయ్య-ఎన్టీఆర్ లేదా.. బాలయ్య- కల్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్ మూవీ ఉంటుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్ర బాలయ్య చేయాల్సి ఉండగా.. ఎందుకో మిస్ అయ్యింది. అంతేకాదు.. అప్పట్లో ఓ దర్శకుడు సిద్ధమైపోయాడని కూడా వార్తలు వచ్చేశాయ్. అయితే అదంతా ఉత్తుత్తే అని.. తేలిపోయింది. అయితే తాజాగా మరోసారి ఇదే విషయం తెరపైకి వచ్చింది. రీమేక్ సినిమా అందులోనూ మల్టీస్టారర్ అని కూడా పుకార్లు వస్తున్నాయ్. ఆ చిత్రం మరేదో కాదట.. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ అని తెలిసింది. ఈగో కలిగిన ఇద్దరు బలమైన వ్యక్తులు తలపడితే ఎలా ఉంటుంది..? అనేది ఈ సినిమా కథాంశం. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు కానీ.. ఇందులో నటించే హీరోలెవరనేది మాత్రం తెలియరాలేదు.

అయితే.. నందమూరి బాలయ్య నటిస్తారని.. ఆయనతో పాటు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ను తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట. బాలయ్యకు రియల్ లైఫ్‌లో బోలెడంత ఈగో ఉందని అప్పుడప్పుడు తెలుస్తుంటుంది. ఆయనైతే సెట్ అవుతాడని నిర్మాత ఆలోచిస్తున్నాడట. అంతేకాదు.. ఒకవేళ ఆయనొద్దంటే ఎవర్ని తీసుకోవాలనే దానిపై కూడా ఆ నిర్మాత సమాలోచనలు చేస్తున్నాడట. మరి ఫైనల్‌గా ఈ ప్రాజెక్ట్ ఎవరిదగ్గరికెళ్లి ఆగుతుందో..? బాలయ్యే ఫైనల్ అవుతారా..? లేకుంటే మరొకరెవరైనా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Remake Multi Starrer Movie.. Balayya and Ntr!:

Remake Multi Starrer Movie.. Balayya and Ntr!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs