Advertisement
Google Ads BL

మహేశ్.. మీ కోసం బుర్రిపాలెం వెయిటింగ్!?


టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మంచి మనసు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు విషయాల్లో మహేశ్ తన దాతృత్వాన్ని చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు. మరీ ముఖ్యంగా చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించడం.. ఆపదలో ఉన్న అభిమానులకు ఆర్థిక సాయం ఇవ్వడం.. ఇలాంటివెన్నే చేస్తుంటాడు. అయితే ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయ్.. అవన్నీ దాదాపు తెరవెనుకే ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే జరిగిపోతుంటాయ్. అంతేకాదు విపత్తులు వచ్చినప్పుడు కూడా పలుమార్లు సూపర్ స్టార్ ఆర్థిక సాయం ప్రకటించాడు. అయితే మరోసారి మహేశ్.. తన మంచి మనసును చాటుకోవాల్సిన సందర్భం వచ్చేసింది.

Advertisement
CJ Advs

సాయమే ముఖ్యం!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అనే మహమ్మారి వైరస్‌ పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం, మరోవైపు తెలుగు రాష్ట్రాలు సైతం లాక్‌డౌన్ చేయడంతో ప్రజలు ఒకింత ఇబ్బందులు పడుతున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితులు గనుక కష్టాలు తప్పవు. ఈ కరోనా నేపథ్యంలో మహేశ్ పలు మార్లు ట్వీట్లు కూడా చేశాడు. అయితే ఇప్పుడు సలహాలు కంటే సాయం ముఖ్యం. ఇక అసలు విషయానికొస్తే.. తన తండ్రి పుట్టిన గుంటూరు జిల్లా తెనాలి ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ గ్రామంలో అభివృద్ధి పనులు షురూ అయ్యాయ్ కూడా. అయితే ఇప్పుడు అదే గ్రామానికి కరోనా నేపథ్యంలో సాయం కోసం వేచి చూస్తోంది. ఒక్క బుర్రిపాలెమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలు సాయం కోసం వేచి  చూస్తున్నారు.

మహేశూ.. మీ కోసం వెయిటింగ్!

ప్రభుత్వం ఆర్థిక సాయంగా ఇస్తున్నప్పటికీ అది అంతంత మాత్రమే గనుక.. మీరు తీసుకున్న దత్తత గ్రామానికి మాత్రం సాయం చేయాల్సిన టైమొచ్చింది.. అక్కడ చాలా మంది పేదలు మీ రాక, మీ సాయం కోసం వేచి చూస్తున్నారు. సో.. ఇక ఆలస్యం చేయకుండా మీ వంతుగా సాయం చేస్తే ఎంతైనా మంచిదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వీలుకాని పక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు మీ వంతుగా ఆర్థిక విరాళం ప్రకటించిన సరిపోతుందేమో. అదేదో ‘సరిలేరు నీకెవ్వరు’ మేం కాపాడుకుంటున్న ప్రాణాలనే డైలాగ్ ఉంది కదూ.. ఎగ్జా్ట్లీ మీరు.. మీకోసమై బుర్రిపాలెంలో చాలా ప్రాణాలే వేచి చూస్తున్నాయ్. ఎంత విరాళం చేసినప్పటికీ బుర్రిపాలెంను ఈ కష్టకాలంలో పట్టించుకుంటే మీ సాయం ఈ జన్మకు మర్చిపోరు మహేశూ.. జర ఆలోచించి.. నిర్ణయం తీసుకుని సాయం చేయండి.. వెయిటింగ్ అక్కడ!.

Mahesh Adopted Village Waiting For Super Star Help!:

Mahesh Adopted Village Waiting For Super Star Help!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs