Advertisement
Google Ads BL

కలకలం.. తెలుగు నటుడికి కరోనా లక్షణాలు!?


కరోనా మహమ్మారి కాటుకు యావత్ ప్రపంచం మొత్తం వణికిపోతోంది. తెలుగు రాష్ట్రాలకు పాకడం.. ఇక్కడ కూడా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండవటంతో జనాలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు లాక్ డౌన్ విధించడంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. మరోవైపు బయటి తిరిగితే పోలీసులు తాట తీసేస్తామని ప్రకటిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి కొత్తవాళ్లు ఎవరొస్తారనే భయం పెరిగిపోయింది.

Advertisement
CJ Advs

అసలేం జరిగింది!?

ఈ క్రమంలో టాలీవుడ్‌ సహాయ నటుడికి కరోనా లక్షణాలున్నాయన్న వార్త ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వార్త విన్న నటీనటులు ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకూ విదేశాలకు షూటింగ్‌కు వెళ్లిన నటీనటులు అంతా సేఫ్‌గానే ఇంటికొచ్చేశారు.. వారంతట వారే సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లిపోయారు కదా..? ఆ లక్షణాలున్న నటుడెవరబ్బా..? అని కనుగొనే పనిలో పెద్దలు సైతం దృష్టి సారించారు. వివరాల్లోకెళితే.. రెండు వారాల కిందట ఆ నటుడు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడని.. కరోనా లక్షణాలున్నప్పటికీ క్వారంటైన్‌లో ఉండలేదట. హైదరాబాద్‌లో ఒకట్రెండు రోజులు మందులు వాడిన ఆయన నేరుగా తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వెళ్లినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు తగ్గకపోవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించడంతో వెంటనే ఐసోలేషన్ వార్డులో పెట్టి చికిత్స ఇవ్వడం మొదలెట్టారట.

ఇంతకీ ఎవరా నటుడు!?

ప్రస్తుతం ఆయన 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారట. మరోవైపు కరోనా టెస్ట్‌లు చేసి పూణేకు పంపడంతో రిపోర్టులో ఏం తేలుతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయట. ఇదిలా ఉంటే.. సదరు నటుడు కుటుంబ సభ్యులను సైతం క్వారంటైన్‌లో పెట్టాలని వైద్యులు యోచిస్తున్నారట. ఆయన సహాయ నటుడిగా తెలుగులో చాలా సినిమాల్లోనే చేశాడట. అయితే.. ఇదంతా చాలా సీక్రెట్‌గా జరుగుతోందట. ఎందుకింత గోప్యంగా ఉంచాల్సి వచ్చింది..? ఇంతకీ ఆ నటుడెవరు..? ఒక వేళ సినిమా కోసమే బ్యాంకాక్ వెళ్లాడా..? ఇదే నిజమైతే ఆయన వెంట ఎవరెవరు వెళ్లారు..? ఎవరెవరు తిరిగొచ్చారని కనుగొనే పనిలో అధికారులు, టాలీవుడ్ పెద్దలు నిమగ్నమయ్యారట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారులు లేదా టాలీవుడ్ నుంచి అధికారిక సమాచారం వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Corona Symptoms To Tollywood Actor!:

Corona Symptoms To Tollywood Actor!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs