టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. నాకు కావాల్సింది.. ‘మూడు వివాదాలు.. ఆరు తిట్లే’ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు. అయితే ఎప్పుడూ అలా వివాదాలతో వార్తల్లో.. తాజాగా కరోనా వైరస్, జనతా కర్ఫ్యూని కూడా వాడేసుకున్నాడు. చిత్ర విచిత్రాలుగా ట్వీట్స్ చేస్తూ నెటిజన్ల నోళ్లలో నానుతున్నాడు. జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, అత్యవసర సిబ్బందికి యావత్ భారత్ చప్పట్లు, శబ్దాలతో అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఆర్జీవీ.. వెటకారంగా స్పందించారు.
ఆ ట్వీట్ అర్థమేంటి..!?
‘ఆదివారం ఎవరికోసమైతే చప్పట్లు కొట్టారో.. ఇవాళ వారినే ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇదే భారతీయుల గొప్ప సంఘీభావం’ అని ఆర్జీవీ వెటకారంగా ట్వీట్ చేశాడు. ఇదొక్కటే కాదు ఇలా చాలానే ట్వీట్స్ చేశాడు. ఆ రోజు ప్రధాని పిలుపునిచ్చారు కాబట్టే అందరూ ఇలా చేశారు సార్.. ఇదే వైద్యులకు గొప్ప సంఘీభావం.. మీరెందుకు అంతలా ఎగిరెగిరి పడుతున్నారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరోవైపు.. తమరు ఎప్పుడైనా ప్రజలకు పనికొచ్చే చేసుంటే.. ఈ రోజుల్లో ఏమైనా చేస్తారని ఆశిస్తాం ఆ ఒక్కటి తప్పా అన్నీ చేస్తారు కదా అని ఇంకొందరు నెటిజన్లు, ఫాలోవర్స్ తిట్టిపోస్తున్నారు. దేశ ప్రజలకు ఏది మంచో..? ఏది చెడో..? తెలుసులెండి.. మీర చెప్పాల్సిన అక్కర్లేదులెండి అని కొందరు అభిమానులు సైతం ఆయనపై మండిపడుతున్నారు. మరోవైపు ఆర్జీవీని సమర్థిస్తూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.