Advertisement
Google Ads BL

స్టార్ స్టేటస్ కి అడుగు దూరంలో ఆగిపోయింది..


టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లు ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చేవి రెండే పేర్లు. రష్మిక మందన్న, పూజా హెగ్డే.. పూజా హెగ్డేకి మొదట్లో ఐరన్ లెగ్ అనే పేరు వచ్చినప్పటికీ కొన్ని రోజుల క్రితం  నుండి పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో వీరిద్దరు మాత్రమే హీరోయిన్లుగా అవకాశం దక్కించుకున్నారు. అయితే వీరిద్దరి కంటే ముందుగా స్టార్ స్టేటస్ ని అందుకోవాల్సిన భామ మాత్రం అక్కడే ఆగిపోయింది.

Advertisement
CJ Advs

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన భామ రకుల్ ప్రీత్ సింగ్ కి వరుస హిట్లతో పాటుగా స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. సక్సెస్ కూడా అందుకుంది. కానీ సడెన్ గా ఏమైందో ఏమో ఒక్కసారిగా టాలీవుడ్ ని వదిలేసింది. బాలీవుడ్ లో అవకాశం రావడంతో టాలీవుడ్ వైపు చూడను కూడా చూడట్లేదు. పోనీ బాలీవుడ్ లో నైనా సెటిల్ అవుతుందేమో అనుకుంటే అక్కడ కూడా ఈమె పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సీనియర్ హీరోలతో తప్ప యంగ్ హీరోల సినిమాలో అవకాశాలు తెచ్చుకోలేకపోతుంది. తెలుగులోనూ నాగార్జునతో చేసిన మన్మధుడు 2 వికటించడంతో ఆమెకి అవకాశాలు రావడం తగ్గిపోయాయి.

ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిపోతుందనుకున్న హీరోయిన్ ఒక్క అడుగు దూరంతో ఆ స్టేటస్ ని చేజార్చుకుంది. మరి మళ్ళీ మరోసారి ట్రై చేసి స్టార్ హీరోయిన్ గా అనిపించుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన థ్యాంక్యూ గాడ్ చిత్రంలో నటిస్తుంది.

She was a step before to the star status :

She is not getting offers in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs