Advertisement
Google Ads BL

కియారా, జాన్వీలతో.. అంటున్న రౌడీ స్టార్!


విజయ్ దేవరకొండ స్టయిల్‌కి ముగ్దులవని హీరోయిన్స్ లేరు. విజయ్ దేవరకొండ‌తో ఎప్పుడెప్పుడు సినిమాలు చేద్దామా అని హీరోయిన్స్ అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌లో రౌడీ స్టార్‌గా విజయ్ దేవరకొండ క్రేజ్ బాలీవుడ్‌లో భీభత్సంగా వుంది. విజయ్ దేవరకొండ స్టయిల్‌కి బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడో ఫిదా అయ్యారు. అలియా భట్ దగ్గరనుండి జాన్వీ కపూర్ వరకు విజయ్ దేవరకొండ స్టయిల్ ని పొగడడమే కాదు.. ఆయనతో అవకాశం రావాలే గాని అంటూ తెగ హొయలు పోతున్నారు. అయితే పూరి జగన్నాధ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ అనుకుంటే.. చివరికి అనన్య పాండే హీరోయిన్ గా పూరి సినిమాలో విజయ్ సరసన నటిస్తుంది. అనన్య పాండే అవకాశం చూసి చాలామందే కుల్లుకున్నారు.

Advertisement
CJ Advs

అయితే విజయ్ దేవరకొండకి ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు.. ఏ హీరోయిన్స్ తో కలిసి నటించాలని ఉంది అని విజయ్ దేవరకొండని అడగగా.. తనకి ప్రత్యేకంగా ఏ హీరోయిన్స్ తోనూ పనిచేయాలని లేదు కానీ... ఎవరితో అయినా నటించాలో చూజ్ చేసుకొమంటే మాత్రం... కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లను ప్రిఫర్ చేస్తా అంటున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ మోస్ట్ బిజీ హీరోయిన్ అయినా కియారాతో విజయ్ ఇప్పటికే ఓ యాడ్‌లో నటించగా... జాన్వీ కపూర్ మాత్రం కరణ్ విత్ కాఫీ షోలో విజయ్ దేవరకొండ స్టలిష్ నటన, స్టైలిష్ లుక్స్ అంటే ఇష్టమని.. విజయ్‌తో ఆఫర్ వస్తే వదలనని చెప్పింది. మరి పూరి సినిమాలో విజయ్ సరసన నటించేందుకు వీరు పేర్లు వినబడినా వారి డేట్స్ ఖాళీ లేక విజయ్‌తో ఆఫర్ వదులుకున్నారు. కానీ విజయ్ వీరిద్దరే తన బెస్ట్ ఛాయస్ అంటున్నాడు.

Vijay Deverakonda Choose Kiara Advani and Jhanvi Kapoor:

Vijay Deverakonda likes Kiara and Jhanvi Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs