Advertisement
Google Ads BL

మహేష్ ఆఫర్‌ని అనిల్ అంగీకరించలేదా?


ప్రస్తుతం మహేష్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడా... అని మహేష్ అభిమానులే కాదు.. సాధారణ ప్రేక్షకుడికి పిచ్చ ఆసక్తి ఉంది. ఎందుకంటే మరో నెలలో వంశి పైడిపల్లి తో సినిమా మొదలెడతాడనుకున్న మహేష్.. వంశి పైడిపల్లి సినిమాని స్క్రిప్ట్ నచ్చని కారణంగా ఆపేసాడు. అప్పటినుండి మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనే క్యూరియాసిటీ అందరిలో కనబడుతుంది. ఇంతకుముందు వంశి సినిమా ఆపేసాక పరశురామ్ తో మహేష్ సినిమా అన్నారు. ఆ సినిమా జూన్ నుండి పట్టాలెక్కుతోంది అన్నారు. కానీ అది కూడా హోల్డ్ లో ఉందనే న్యూస్ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

మరోపక్క మహేష్ మళ్ళీ అనిల్ రావిపూడితోనే సినిమా చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు తర్వాత మరో సినిమా చేద్దామని మహేష్ అనిల్ కి మాటిచ్చాడు. కానీ అనిల్ రావిపూడి సరిలేరు తర్వాత ఎఫ్ 3 స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు. కానీ అటు వరుణ్ తేజ్, ఇటు వెంకటేష్ చేతిలోని సినిమాల్తో బిజీగా ఉన్నారు. ఈలోపు మహేష్ అనిల్ దగ్గరికి వెళ్లి మరో కథ తీసుకురా ఎఫ్ 3 మొదలయ్యేలోపు ఓ సినిమా ఫాస్ట్ గా చేద్దామనే ప్రపోజల్ పెట్టాడని.. కానీ అనిల్ రావిపూడి మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా మనం అనుకున్నట్టుగా రీచ్ కాలేదు గనక ఈసారి పవర్ ఫుల్ స్టోరీ తో పవర్ ఫుల్ గా సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యా అని.. అందుకే హడావిడి గా ఇప్పుడు సినిమా చెయ్యడం కరెక్ట్ కాదని చెప్పినట్లుగా చెబుతున్నారు. మరి మహేష్ అడిగితే అనిల్ అలా చెప్పాడా అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

Anil Ravipudi Rejected Mahesh Babu Offer:

Mahesh Babu gives offer.. but anil Rejected
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs