Advertisement
Google Ads BL

కియారాకు అక్కడ రివర్స్ గేర్ స్టార్ట్ అయినట్లేనా?


ప్రస్తుతం కియారా అద్వానీ బాలీవుడ్‌లో బడా హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరుకుంది. బాలీవుడ్‌లో బడా మూవీస్ లో నటిస్తున్న కియారా అద్వానీ వరస హిట్స్ తో హాటెస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ నాలుగైదు సినిమాల్తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన కియారా అద్వానీ పై బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కినుకు వహించాడనే న్యూస్ వినబడుతుంది. బాలీవుడ్ లో క్రేజీ నిర్మాతగా హాట్ అండ్ బడా హీరోస్ తోనూ హీరోయిన్స్ తోనూ సినిమాలు నిర్మించే కరణ్ జోహార్ తో సినిమాలు చేసేందుకు హీరోయిన్స్ అంతా క్యూ కడతారు.

Advertisement
CJ Advs

కానీ కియారా అద్వానీ మాత్రం కరణ్ జోహార్ కి నో చెప్పిందట. కరణ్ జోహార్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ తోనే కియారా అద్వానీ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుని.. బాలీవుడ్ లో బడా హీరోయిన్ గా మారింది. అయితే ప్రస్తుతం సినిమాల మీద సినిమాల్తో జోరుగా ఉన్న కియారా అద్వానీతో కరణ్ జోహార్ ఓ సినిమా కోసం సంప్రదించాడట. కరణ్ జోహార్ తన సొంత బ్యానర్లో తెరకెక్కించబోయే మిస్టర్ లెలె సినిమా కోసం కరణ్ హీరోయిన్ గా కియారా ని సంప్రదించగా.. కియారా చేతిలో ఉన్న సినిమాల్తో మీ సినిమా కోసం డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. దానితో కరణ్ జోహార్ నేను నీకు లైఫ్ ఇస్తే.. నా సినిమా చెయ్యవా అంటూ కియారా మీద కినుకు వహించాడనే న్యూస్ నడుస్తుంది. దీంతో కియారాకు ఇక బాలీవుడ్‌లో రివర్స్ గేర్ స్టార్ట్ అయినట్లే అంటూ బాలీవుడ్‌లో కొందరు అనుకుంటుండటం విశేషం.

Kiara advani says no to karan johar film:

problems started kiara advani in bollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs