Advertisement
Google Ads BL

అల్లు అరవింద్ సరికొత్త ట్రెండ్.


తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ సరికొత్త ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాతో  మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆప్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు అల్లు అరవింద్. దానికోసం అల్లు అర్జున్ తో ప్రమోషన్ చేయించడానికి సిద్ధం అయ్యాడు. వందశాతం తెలుగు చిత్రాలు, వెబ్ సిరీస్ లని అందిస్తున్న ఈ యాప్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. అయితే అల్లు అరవింద్ ఆహా కోసం రూపొందించిన ఒకానొక వెబ్ సిరీస్ ని సినిమాగా మారుస్తున్నాడు.

Advertisement
CJ Advs

లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో నవదీప్ హీరోగా వచ్చిన మస్తీస్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ ని చూసిన అల్లు అరవింద్, దాన్ని స్క్రీన్ ప్లేని కాస్త మార్చి సినిమాలాగా తయారుచేయని ఆదేశించాడట. అల్లు అరవింద్ వంటి పెద్ద నిర్మాత ఎన్నో సినిమా విజయాలని అంచనా వేసిన వ్యక్తి అలా చెప్పేసరికి లక్ష్మీ కాంత్ మస్తీస్ వెబ్ సిరీస్ ని సినిమాకి తగ్గట్టుగా కత్తిరించే పనిలో ఉన్నాడట.

మరి అల్లు అరవింద్ ని మెప్పించిన కథ అంటే అందులో ఖచ్చితంగా విషయం ఉంటుందని, సినిమాకి కావాల్సిన అన్నీ హంగులు ఆ కథకి ఉండటం వల్లనే అల్లు అరవింద్ అలా చెప్పి ఉంటాడని భావిస్తున్నారు. మరి సినిమా పూర్తయి విడుదల అయితే గానీ తెలియదు అల్లు అరవింద్ ని అంతగా ఆకర్షించిన అంశం ఏమిటో..?

Allu Aravind setting new trend:

Allu Aravind creating new trend with his ideas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs