Advertisement
Google Ads BL

చైతూ.. సాయిపల్లవి అలాంటిది కాదు..!


మలార్‌ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె టాలెంట్ గురించి అయితే అస్సలే చెప్పనక్కర్లేదు. హీరోయిన్‌కి ఉండాల్సిన గ్లామర్‌ అప్పీల్‌ లేకున్నా.. ఏదో మాయ చేసేసి అలా సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ ఎట్రాక్షన్‌‌తో స్టార్ హీరోయిన్లలో ఒకటిగా రాణిస్తోంది. ఈ బ్యూటీ గురించి ఇప్పటి వరకూ లెక్కలేనన్ని పుకార్లు షికార్లు చేశాయి. తన పక్కన నటించిన ఏ హీరోనైనా ఈజీగా డామినేట్‌ చేసేస్తుందని.. అదే ఆమె యాక్టింగ్‌ టాలెంట్‌ గొప్పతనమని క్రిటిక్స్ చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఈ బ్యూటీ చాలనే సినిమా అవకాశాలు కోల్పోయిందని.. ఇదొక్కటే ఆమెకు మైనస్ అని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఈ ఒక్క కారణంతో నే స్టార్ హీరోయిన్‌గా ఉండాల్సిన ఈ బ్యూటీ.. హీరోయిన్లలో ఒకరుగా నిలిచిందని కూడా చెబుతుంటారు.

Advertisement
CJ Advs

అయితే.. ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అదెలాగంటే.. అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి జోడీగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌ స్టోరీ’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కూడా సాయి పల్లవి డామినేషన్‌ని తట్టుకోలేక తెర వెనుక విమర్శలు చేస్తున్నాడనే గుసగుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విషయం దర్శకుడి చెవిన పడటంతో చైతూ.. సాయి పల్లవి అస్సలు అలా ఫీలయ్యే అమ్మాయి కాదు.. ఎందుకంటే తాను ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేశాను కాబట్టి తనగురించి అంతా తెలుసని చెప్పాడట. ఇందులో నిజమెంతో కానీ.. శేఖర్‌ కమ్ముల మాత్రం బాగానే కవర్ చేస్తూ వెనకేసుకొస్తున్నారట. 

అయితే.. ఇప్పటికే ఇలాంటి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తుండటంతో సాయిది అలాంటి మనస్తత్వం కాదని ఆమె ఫ్రెండ్స్ కూడా సోషల్ మీడియా, మీడియా ముఖంగా కుండబద్దలు కొట్టారు. పదే పదే ఇలా ఎందుకు పుకార్లు వస్తున్నాయో..? అసలు ఇందులో నిజానిజాలెంత..? బహుశా గిట్టని వాళ్లే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారా..? అనేదానిపై క్లారిటీ రావాలంటే ఎప్పుడో ఒక్కసారైనా సాయిపల్లవి మీడియా ముందుకు రాక తప్పదు మరి.

News about Malar Beauty Sai Pallavi!:

News about Malar Beauty Sai Pallavi!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs