Advertisement
Google Ads BL

అఖిల్‌తో నితిన్ సినిమా.. లెక్క తేలుస్తాడా!?


అన్నీ ఉన్నా ఐదోతనం తక్కువ ఉందన్నట్లుగా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్‌కు మాత్రం అన్నీ ఎక్కువే అయినప్పటికీ సినిమాల పరంగా చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా లేదు.. హిట్ లేదూ..! అదే కుటుంబం నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం దూసుకెళ్తున్నాడు.. విభిన్న కథనాలతో మంచి మంచి హిట్‌లతో ముందుకెళ్తున్నాడు. అంతేకాదు.. చైతూతో సినిమా అంటే డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. అదే అఖిల్‌తో అంటే మాత్రం జంకుతున్నారట. ఎక్కడ తాము తెరకెక్కించిన చిత్రం ఫెయిల్ అయితే మళ్లీ మనకు ఆ చెడ్డపేరు ఎందుకులే అని భయపడుతున్నారట.

Advertisement
CJ Advs

అయితే ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి రెకమెండేషన్‌తో సురేందర్ రెడ్డి.. అఖిలో సినిమా తెరకెక్కిస్తాడని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగార్జున-అఖిల్‌ను కూర్చోబెట్టి కథ చెప్పాడని.. ‘మెస్ట్ వాంటెడ్ బ్యాచిలర్’ తర్వాత సినిమా చేయాలని భావిస్తున్నారట. మొదట ఈ సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ కూడా రెడీగా ఉందని వార్తలు వినిపించనప్పటికీ అదంతా పుకార్లేనని అఖిల్ కోసం యంగ్ హీరో నితిన్ రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తోంది.

వాస్తవానికి అఖిల్ తొలి సినిమాకు నితిన్ నిర్మాత‌గా వ్యవహరించగా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో నితిన్‌కు 20 నుంచి 30 కోట్ల వ‌ర‌కూ న‌ష్టాలొచ్చాయ‌ని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. అఖిల్ నెక్స్ట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి.. ఆ లెక్కలన్నీ తేల్చుకోవాలని నితిన్ నిర్ణయించాడట. నితిన్-అఖిల్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ అయినప్పటికీ అఖిల్ కంటే సురేందర్ రెడ్డి నమ్మకంతోనే నిర్మాతగా వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడట. మరి ఇందులో నిజమెంత..? ఇదే నిజమైతే ఈసారైనా లెక్క తేలుస్తాడా..? లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Nithin Producer To Akkineni Akhil Next Movie.. !:

Nithin Producer To Akkineni Akhil Next Movie.. !  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs