Advertisement
Google Ads BL

చేజేతులా పరువు తీసుకుంటున్న లేడీ సింగర్!


టాలీవుడ్ సింగర్ స్మిత.. గురించి ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు. పాప్ సింగర్‌గా తెలుగు నుంచి ఉన్న ఏకైక గాయనిగా, తన ఆల్బమ్స్‌తో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా తన పాటలతో కుర్రకారునంతా మాయచేసి.. హీరోయిన్‌కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె.. నాటి నుంచి నేటి వరకూ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది.. టాప్ సింగర్‌ పేరుగాంచింది. అలాంటి స్మిత ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్‌తో చేజేతులారా పరువు తీసుకుంటోందని క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది..? ఎందుకిలా జరుగుతోంది..? అనే ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

ఒకప్పుడు టాపర్.. ఇప్పుడు ఇలా!

‘మసక మసక చీకటిలో’.. అని పాడాలన్నా.. ‘సన్నజాజి పాడాక’ అంటూ క్లాసిక్స్ రీమిక్స్ చేయాలన్నా స్మిత తర్వాతే మరెవరైనా. ఇలాంటి ఎన్నో వండర్స్‌ను క్రియేట్ చేసి టాలీవుడ్ మొదలుకుని చాలా భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. కొన్ని కొన్ని సాంగ్స్ స్మిత తప్ప మరెవరివల్లా సాధ్యం కాదని దర్శకనిర్మాతలు చెబుతుంటారు. అలాంటి స్మిత 2014 ఎన్నికలు మొదలుకుని 2020.. నిన్న మొన్నటి వరకూ చిత్ర విచిత్రాలుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. కులం.. గోత్రం పెద్దవే ఉండొచ్చు గాక మరీ ఇలా చిల్లర కామెంట్స్ చేసి ఇలా వార్తల్లో నిలవటం ఎంతవరకు సమంజసం అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. 

వైసీపీ వర్సెస్ టీడీపీ!

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వాయిదాపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, మాజీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. జగన్ అయితే ఏకంగా నిమ్మగడ్డ.. చంద్రబాబు సామాజిక వర్గమేనని.. బాబే నియమించారని కూడా మాట్లాడారు. మరోవైపు ఇందుకు కౌంటర్‌గా టీడీపీ నేతలు కూడా మాట్లాడారు. ఇలా కౌంటర్‌లకు.. స్ట్రాంగ్ కౌంటర్లుగా పెద్ద రగడే జరిగింది.

రియాక్ట్ అవ్వడమెందుకో!

ఈ రగడలో కలుగజేసుకున్న స్మిత ఏకంగా సీఎం వైస్ జగన్‌నే టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు. మానవత్వం లేని వాడు మతం ముసుగు వేస్తాడు. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జనులంతా ఒక కుటుంబం. జగమంతా ఒక నిలయం’ అనేది నిజమని స్మిత పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు, జగన్ ఫ్యాన్స్ దుమ్ముదులిపి వదిలారు. ఎవరికీ కుల పిచ్చి ఉందో బాగా తెలుసులెండి మేడమ్.. ఇక మీ సోది ఆపండి అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఏమైనా అంటేనే స్పందిస్తావా? మీ కబుర్లు ఇక ఆపండంటూ వైసీపీ వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే మరీ తీవ్రంగా స్పందిస్తూ.. ‘పతివ్రత పాయసం వండితే వారం రోజులు చల్లార లేదట’ అని ఇష్టానుసారం స్మితపై రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. 

ఇవన్నీ అవసరమా..!?

అసలు రాజకీయాల గురించి స్మితకు ఎందుకు..? అనవసర విషయాల్లో తలదూర్చి ఇలా తిట్లు.. బూతుల వర్షం కురిపించుకోవడం అవసరమా..? అని క్రిటిక్స్, సినీ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. అభిమానం.. కులం అయ్యుండొచ్చుగాక అవన్నీ మనసులో పెట్టుకోవాలే కానీ.. ఇలాంటి సోషలక మీడియా కాలంలో బయటపెడితే మాత్రం అస్సలు ఊరుకోరని వైసీపీ ఫ్యాన్స్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇలా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తుండటంతో ఆ ట్వీట్స్ అన్నీ తీసేసింది. ఇలా ట్వీట్ చేసి చేజేతులారా పరువు తీసుకోవడమెందుకు మేడం.. కాస్త ఆలోచించండి అంటూ సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇకనైనా మిన్నకుంటుందో లేకుంటే మళ్లీ మళ్లీ సోషల్ మీడియాకెక్కి కెలుక్కుంటుందో వేచి చూడాలి!.

News About Lady Singer Smitha Vallurupalli!:

News About Lady Singer Smitha Vallurupalli!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs