Advertisement
Google Ads BL

ఛీ.. నాకే ఎందుకిలా.. స్టార్ హీరో ఆవేదన!?


డాక్టర్ కొడుకు డాక్టర్.. సింగర్ కొడుకు సింగర్.. కలెక్టర్ కొడుకు కలెక్టర్ కావాలనే వారి తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి.. కోట్లు ఖర్చుపెట్టి మరీ చదివిస్తుంటారు. ఇక హీరోలైతే వారి వంశవృక్షాన్ని నిలబెట్టుకోవాలని ఎంతో కష్టపడి మరీ ట్రైనింగ్‌లు ఇప్పించి.. తన తర్వాత ఇదిగో వీడే మా ఇంటి నుంచి వస్తున్న వారసుడు అని పరిచయం చేస్తుంటారు. అలా మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలే వారి వారి వారసులను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. 

Advertisement
CJ Advs

అయితే.. ఓ స్టార్ హీరో, టాలీవుడ్ సీనియర్ నటుడు మాత్రం తన కుమారుడ్ని ఇండస్ట్రీకి నానా తంటాలు పడుతున్నాడట. ఆయనేమో హీరో చేయాలని తపిస్తుంటే.. కుమారుడేమో తనకు హీరోయిజం నచ్చదన్నట్లుగా ఫ్రెండ్స్‌తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. అంతేకాదు అటు తిరిగి.. ఇటు తిరిగి ఓ రేంజ్‌లో బొర్ర (పొట్ట) పెంచేశాడట. దీంతో ఆ పొట్టను తగ్గించడానికి జిమ్ వెళ్లమంటే కూడా వినట్లేదట. ట్రైనింగ్‌కు వెళ్లినట్లు వెళ్లి ఏదో నేర్చుకుని వస్తాడనకుంటే ఖాళీ చేతులతో ఇంటికొస్తున్నాడట. అంతేకాదండోయ్.. ఈ ఆ మధ్య కుమారుడి కోసం సీనియర్ హీరో యాగాలు కూడా చేయించాడని వార్తలు కూడా గుప్పుమన్నాయ్.

ఇంతకీ హీరో కాకుండా ఏమవుతావ్ అని అడగ్గా ఆ కుర్రాడు మాత్రం నోరు మెదపట్లేదట. పోనీ బిజినెస్‌ వైపు ఆసక్తి ఉందా అంటే అదీ లేదట. ఆఖరికి తలనోరు మొత్తుకుంటున్నా వర్కవుట్ అవ్వటేదట. దీంతో తనతోనే తన ఇంటి హీరోయిజం ఆగిపోతుందేమో..? అసలు వీడ్ని ఏం చేయాలి..? ఛీ .. ఛీ నాకే ఎందుకిలా జరుగుతోంది..?  అని ఆ హీరో రోజూ బాధపడుతున్నాడట. తన సన్నిహితులు, బంధువులతో కుమారుడి గురించి చెబుతూ ఆయన తెగ ఫీలయిపోతున్నాడట. మిత్రులు మాత్రం ఏదో ఒకటి చేద్దాం.. నువ్వేం బాధపడకు అని అభయమిస్తున్నారట. మరి ఫైనల్‌గా కుమారుడి వ్యవహారంలో ఆ సీనియర్ హీరో ఎలా ముందుకెళ్తాడో..? ఏం చేస్తాడో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేదానిపై కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు వేయి కళ్లతో వేచిచూస్తున్నారట.

Star Hero Feel Over His Son Becoming Hero!:

Star Hero Feel Over His Son Becoming Hero!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs