Advertisement
Google Ads BL

నెటిజన్ల దెబ్బకి సారీ చెప్పిన రష్మీ..!


యాంకర్ రష్మీ తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే నెటిజెన్స్‌ని ఆడుకుంటుంది. వారికి తగిన సమాధానం చెబుతూ మరోసారి తన జోలికి రాకుండా చెయ్యగల సత్తా ఉన్న యాంకర్. 40 ఏళ్ళు వస్తున్నా పెళ్లి చేసుకోకుండా ఉన్న రష్మీని సుధీర్‌తో లింకప్ చేసి పాపులర్ చేసారు. రష్మీ సుధీర్ జోడి మీద కామెడీ కామెంట్స్ బాగా పేలుతాయి. జబర్దస్త్, ఢీ షోస్ లో యాంకర్ రష్మీ చాలా యాక్టీవ్. అనసూయ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న యాంకర్ రష్మినే. అయితే ఎప్పుడూ నెటిజెన్స్‌కి తగిన సమాధానం చెప్పే రష్మీ ఈసారి మాత్రం నెటిజెన్స్ చేతికి అడ్డంగా దొరికిపోయింది. కారణం కరోనా వైరస్. కరోనా వైరస్‌కి భయపడి సినిమా షూటింగ్ దగ్గరనుండి, టివి సీరియల్స్ షూటింగ్స్ వరకు అంతా బంద్ చేస్తుంటే... రష్మీ మాత్రం షాపు ఓపెనింగ్‌లు చేసుకుంటుంది.

Advertisement
CJ Advs

రాజమండ్రిలోని ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళుతున్నట్టుగా ట్వీట్ చెయ్యడమే కాదు... రష్మీ ఓపెనింగ్ సమయానికి రష్మిని చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. అప్పుడు పోలీస్ లు ప్రజల్ని కంట్రోల్ చేసి భారీగా గుమికూడిన జనసందోహాన్ని అక్కడినుండి పంపేశారు. అయితే రష్మీ ఆ షాప్ ఓపినింగ్ కి వస్తున్నట్టుగా ముందస్తుగా ట్వీట్ చెయ్యడం వలనే ప్రజలు కరోనా భయం లేకుండా అధిక సంఖ్యలో వచ్చారని... అందరూ అన్ని ఆపుకుని కూర్చుంటే నువ్వు మాత్రం షోరూం ఓపెనింగ్ కి ఎలా వచ్చావ్ అంటూ నెటిజెన్స్ పెద్ద సంఖ్యలో రష్మిని టార్గెట్ చేశారు. ఇక రష్మీ షోరూం ఓపెనింగ్ అయ్యాక తాయితీగా క్షమాపణలు చెప్పింది. కరోనాతో ఎవరు భయపడడం లేదని.. అయినా జాగ్రత్తలు అవసరమని, కొంతమంది బయట ఫుడ్ ఇష్టానుసారంగా తింటున్నారని.. వారు మారాలని... తాను ట్వీట్ చేసి ఇలా చెయ్యడం మంచిపని కాదని అందుకే సారీ చెప్పానని ట్విట్టర్ వీడియోలో చెప్పుకొచ్చింది.

Anchor Rashmi says sorry to netizens :

Netizens trolling on Anchor Rashmi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs