Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫ్యాన్స్ ని భలే నమ్మించారే..!


బాహుబలి సినిమా ద్వారా ఇండియా వైడ్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం నేషనల్ లెవెల్లో ప్రభాస్ కి ఉన్న క్రేజే వేరు. బాలీవుడ్ హీరోలని సైతం వెనక్కి నెట్టి తన స్టామినాని బాగా పెంచుకున్నాడు. ఆ స్టామినా సాహో రూపంలో బయటపడింది. సాహో దక్షిణాదిన అంతగా ఆడకపోయినా ఉత్తరాదిన కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

రాధాక్రిష్ణతో సినిమా తర్వాతా ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా ఒప్పుకున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ ఉగాదికి ఈ చిత్ర టైటిల్ ని ప్రకటిస్తామని ఓ ప్రకటన వెలువడింది. అది వైజయంతీ మూవీస్ నుండి కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కానీ అసలు విషయానికి వస్తే అది ఫేక్ అని తేలింది.

వైజయంతీ మూవీస్  పేరుతో ఫేక్ అకౌంట్ నడుపుతున్న కొందరు ఆకతాయిలు అలా మెసేజ్ పెట్టారని సమాచారం. వైజయంతీ మూవీస్ వారి అధికారిక అకౌంట్ ఏదో తెలియకపోవడంతో ఇలాంటి పొరపాటు జరిగింది. ఈ వార్త తెలియడంతో తాము అనవసరంగా నమ్మి మోసపోయామని చింతిస్తున్నారు.

Prabhas fans expected a title :

PRabhas fans expected a title of Nag Ashwin Prabhas combo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs