Advertisement
Google Ads BL

సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌!


అమలాపాల్‌.. టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా మొదటి పెళ్లికి ముందు వివాదాలకు చాలా వరకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ విడాకులు వచ్చే వరకూ యమా స్పీడ్ పెంచేసింది. ఒక్కోసారి ఈమె చేసిన వ్యాఖ్యలతో జాతీయ మీడియాలో సైతం నిలిచిందంటే అర్థం చేసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి తర్వాత అమలాపాల్‌కు రెక్కలొచ్చాయ్.. అయితే ఆ రెక్కలు అతి కొద్దిరోజుల్లోనే విరిగిపోయాయ్ కూడా. దీంతో చివరికి గత ఏడాది మొదటి భర్తతో విడాకుల దాకా వెళ్లింది. డివోర్స్ అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోని ఈ భామ సినిమాల్లో రాణిస్తూనే ఉంది.

Advertisement
CJ Advs

అయితే.. కొన్నిరోజులుగా ఓ సింగర్‌తో ప్రేమలో మునిగి తేలుతోందని త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ఎప్పట్నుంచో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయ్.. ఫొటోలు కూడా దర్శనమిచ్చాయ్.. ఈ పిక్చర్స్ చూసిన తెగ కామెంట్ చేశారు. అయితే ఈసారి మాత్రం ఏకంగా పెళ్లి చేసుకునే అభిమానులు, సినీ ప్రియుల ముందుకొచ్చేసింది. ఆమె భర్త మరెవరో కాదండోయ్.. సింగ‌ర్ భ‌వ్నీంద‌ర్ అడై. ప్రస్తుతం అమలాపాల్‌ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మూడో కంటికి తెలియకుండా సీక్రెట్‌గా ఈ ఇద్దరు అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే ఆ పెళ్లి ఫొటోలు నిజమైనవో, కావో..? కొంపదీసి వీరిద్దరూ కలిసి ఏమైనా సినిమా తీస్తుండగా.. దానికి తాలుకూ ఫొటో షూట్ ఇలా చేశారా..? అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎవరైనా ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారనే విషయంపై క్లారిటీ రాలేదు. మరోవైపు.. ఇటు అమలా కానీ.. అటు సింగర్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి.. మౌనానికి అర్థం అంగీకారమనే తెలిసిపోయింది. అసలు ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.

Actress Amala Paul gets hitched secretly?:

Actress Amala Paul gets hitched secretly?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs