Advertisement
Google Ads BL

ఈ పిల్ల మరో పూజా హెగ్దే అవుతుందేమో!?


తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయం అవుతుంటారు.. వీరిలో తెలుగు వారే అతి తక్కువ కానీ.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎక్కువగా ఉంటారు. వాస్తవానికి టాలెంట్, అందం, అభినయం ఉంటే తెలుగులో అవకాశాలకు అస్సలే కొదవుండదు. ఒకే ఒక్క సినిమా హిట్ పడితే ఇక ఆ భామ పేరే కాదు.. రేంజ్ కూడా ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇందుకు చక్కటి ఉదాహరణ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దేనే. అందం, అభినయం, ఎక్స్‌ప్రెషన్స్.. ఇంకా చాలా చాలానే ఈ భామకు ఎక్కువే. మొదట ఒకట్రెండు సినిమాల్లో అంతగా అనిపించకపోయినప్పటికీ.. ఆ తర్వాత ఫుల్‌పామ్‌లోకి వచ్చేసింది.. అలా జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా.. స్టార్ హీరోలతో కూడా నటించేసింది. దీంతో కుర్ర హీరోలతో సినిమా అంటే చాలు మొదట పూజానే దర్శకనిర్మాతల చాయిస్.. అలా తయారయ్యింది పరిస్థితి. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇటు టాలీవుడ్‌ను అటు బాలీవుడ్‌ను దున్నేస్తోంది.

Advertisement
CJ Advs

సింగిల్ సాంగ్‌కే!

ఇదిలా ఉంటే.. ఈ భామకు ముందు సమంత ఇండస్ట్రీని ఏలేసింది. పెళ్లి తర్వాత కూడా ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ మునుపటిలా పరిస్థితుల్లేవ్. దీంతో ప్రస్తుతం పొడుగుకాళ్ల సుందరే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. అయితే.. తాజాగా ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ‘కృతి శెట్టి’ ని చూస్తుంటే.. పూజా హెగ్దేను మించిపోయేలా ఉందని క్రిటిక్స్, సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఈ భామ నటించింది (ఇంకా పూర్తిగా సినిమా కాలేదు) ఒకే ఒక్క సినిమాలోనే.. పైగా రిలీజ్ అయ్యింది సింగిల్ సాంగ్ మాత్రమే. ఈ ఒక్క పాటలనే తన రేంజ్.. తన అంద చందాలు, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ చూపించేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. చక్కని కనుముక్కుతీరుతో యూత్‌ను బాగా కట్టిపడేసింది.

‘కృతి సార్.. కృతి అంతే’!

ఎందుకిలా అంటే.. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో ఆ బ్యూటీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు సినీ ప్రియులు, యూత్, నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఒక్కొక్కరు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. వామ్మో ఈ పిల్ల స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ఫీలింగ్ అనిపిస్తోంది. ఆ అమ్మాయి సొట్ట బుగ్గలకు కుర్రకారు తెగపడిపోయారు. ఇంకొందరేమో ఆ అమ్మాయి నవ్వు చూసి లైక్ కొట్టకుండా ఉండలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ‘కృతి సార్.. కృతి అంతే’ అంటే అంటున్నారు. అంతేకాదండోయ్ ఈ సాంగ్‌కు ఇప్పటి వరకూ 19,225,016 వ్యూస్ రావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. 10,235 కామెంట్స్ రాగా.. అందులో సుమారు సగానికి పైగా ఈ పిల్ల గురించి ఉండటం విశేషం. అయితే.. మోషన్ పిక్చర్‌తో కూడిన ఈ వీడియోకే ఈ రేంజ్‌లో వ్యూస్ ఉంటే.. వీడియో సాంగ్ వచ్చినా.. సినిమా రిలీజ్ అయినా పరిస్థితి మామూలుగా ఉండదేమో మరి.

సినిమా పూర్తి కాకముందే..!

ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయట. సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘18 పేజీలు’లో హీరోయిన్‌గా ఈ కుర్ర బ్యూటీనే తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఒకరిద్దరు దర్శకనిర్మాతలు కూడా తన తదుపరి సినిమాల్లో నటించాలని సంప్రదించారట. అయితే.. ప్రస్తుతానికి మాత్రం ఈ ముద్దగుమ్మ మాత్రం చూద్దాం అని మిన్నకుండిపోయిందట. మొత్తానికి చూస్తే.. ముద్దుగుమ్మ అందానికి సొట్ట బుగ్గలు తోడైతే, వచ్చే అందమే వేరు.. అలాంటి సొట్ట బుగ్గల సుందరాంగులు చాలా తక్కువ మంది ఉంటారన్న విషయం కృతి శెట్టితో నిరూపితమైంది. మరి మున్ముంథు ఈ పిల్ల మరిన్ని అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా రాణించాలని www.cinejosh.com టీమ్ మనస్పూర్తిగా కోరుకుంటోంది.

These Beauty Becomes Another Pooja Hegde In Tollywood!:

These Beauty Becomes Another Pooja Hegde In Tollywood!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs