ఈటీవీలో జబర్దస్త్ మొదలవ్వడానికి వెనుక నాగబాబు ఉన్నాడు. ఆయన వలనే జబర్దస్త్ మొదలైంది. ఇక అప్పటి నుండి నాగబాబే జబర్దస్త్ ని బాగా హ్యాండిల్ చేసాడనే ప్రచారం జరిగింది. చాలామంది అదే నిజమనుకున్నారు. కానీ తాజాగా ఓ కమెడియన్ మాత్రం జబర్దస్త్ పుట్టడానికి నాగబాబు కారణం కాదు.. నేనే అంటున్నాడు. ఒకప్పుడు జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ గా మంచి స్కిట్స్ కొట్టిన ధనాధన్ ధనరాజ్. జబర్దస్త్ మొదలైనప్పుడు జబర్దస్త్ స్కిట్స్ లో చాలా ఆక్టివ్ గా ఉంటూ మంచి స్కిట్స్ చేసిన ధనరాజ్ సినిమా అవకాశాలతో బిజీ కావడం తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వలేక నాగబాబుతో పాటు జీ ఛానల్ అదిరింది ప్రోగ్రాంలో చేరి స్కిట్స్ చేస్తున్నాడు.
ఇక జబర్దస్త్ పుట్టడానికి గల కారణాలు ఏమిటనేది ధనరాజ్ మాటల్లో జగడం, పరుగు, గోపి గోపిక గోదావరి, భీమిలి కబడ్డీ జట్టు ఫారంలో కొచ్చిన మేనేజర్ ఎడుకొండలు తనను కలుసుకుని కామెడీ షో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని అడగడం తర్వాత చంద్రని, వేణు, రఘు వంటి కమెడియన్స్ పిలిపించి ఒప్పించి ఈ జబర్దస్త్ షో మొదలెట్టినట్టుగా చెబుతున్నాడు. ఇక నేనే ప్రతి ఒక్కరికి వారి పారితోషికాన్ని కూడా ఖరారు చేశానని అలా 13 ఎపిసోడ్లు చేశానని చెబుతున్నాడు. అలాగే జబర్దస్త్ షో మొదలైనప్పటి నుండే మంచి క్రేజ్ తెచ్చుకుందని తర్వాత కొత్తవాళ్లు రావడంతో షోలో మార్పులు జరిగాయని ఇక నాగబాబు గారు జబర్దస్త్ ని చక్కగా హ్యాండిల్ చేసేవారని చెప్పిన ధనరాజ్... నాగబాబు జబర్దస్త్ ని వదిలి అదిరింది షో చేస్తునప్పుడు ధనరాజ్ ని పిలిచి అదిరింది చెయ్యమన్నారని.. అయితే జబర్దస్త్ కి స్టార్ డం తెచ్చి జబర్దస్త్ ఎదుగుదలకి పాటుపడడంతో ఆయన మాట కాదనలేక అదిరింది చేస్తున్నా అంటూ జబర్దస్త్ పుట్టుపూర్వోత్తరాలు వివరించాడు.