మహమ్మారిగా మారిన కరోనా వైరస్ తన కోరల్ని మరింత విస్తృతం చేసింది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ ఈ వైరస్ సోకుతుంది. ప్రస్తుతం ఈ వైరస్ కారణంగా ప్రపంచమే ఐసోలేషన్ లో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. చైనాలో పుట్టిన ఈ వైరస్ వ్యాప్తి అక్కడ తగ్గుముఖం పడుతున్న సమయంలో ఇతర దేశాల్లో చాలా వేగంగా విస్తరిస్తుంది. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ ఇందిరాదేవికి కరోనా సోకింది.
కామసూత్ర, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి సినిమాల్లో నటించిన భారత సంతతికి చెందిన ఇందిరాదేవికి కరోనా పాజిటివ్ అని తేలింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఈమెకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఈమెను ఐసోలేషన్ వార్డ్ లో ఉంచారు. ఈ సందర్భంగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా ఇందిరా దేవి అభిమానులకి మెసేజ్ పంపింది.
ప్రస్తుతానికి ఇండియాలో కరోనా వల్ల ప్రమాదకర పరిస్థితులు లేకపోయినప్పటికీ ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, వ్యాధికి చికిత్స కంటే నివారణే ముఖ్యం అని ప్రచారం చేస్తున్నారు.