ప్రస్తుతం కరోనాతో RRR వాయిదా పడిన విషయంలో రాజమౌళి ఎలా ఫీలవుతున్నాడో ఆయనకే తెలియాలి కానీ.. ఈనెలలో ఎలాగోలా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ని కూల్ చేద్దామనుకుని.. RRR అప్ డేట్ మర్చిలో అంటూ ప్రకటన ఇప్పించాడు. తీరా చూస్తే RRR అప్ డేట్ ఇవ్వాలో వద్దో కూడా తెలియని పరిస్థితి. కరోనా వలన ఏం చెయ్యాలన్నా ఇబ్బందే. అయితే తాజాగా రాజమౌళి మరో విషయంలో తల పట్టుకున్నాడట. అదేమంటే టైటిల్ విషయం. RRR టైటిల్ విషయం ఇంకా తెగడం లేదు. మరోపక్క బాలీవుడ్ భామ అలియా విషయం జోరుగా హుషారుగా సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.
అలియా భట్ తో ఇంకా RRR షూటింగ్ చెయ్యలేదని.. కానీ అలియా డేట్స్ అయ్యిపోయాయనే టాక్ మొదలయ్యింది. గతంలో రామ్ చరణ్ - అలియా సన్నివేశాలను తీద్దామంటే రామ్ చరణ్ కి దెబ్బ తగలడంతో పోస్ట్ పోన్ అయ్యింది. తరవాత సైరా ప్రమోషన్స్ తో వాయిదా, తాజాగా కరోనా దెబ్బకి అలియా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేని పరిస్థితిలో ఉందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమాలతో బిజీగా ఉండడంతో RRR కి డేట్స్ ఇవ్వలేకపోతుందట. పూణే షెడ్యూల్‌లో అలియా RRR టీమ్‌తో జాయిన్ కానుందని అన్నారు. కానీ కరోనా దెబ్బకి అలియా రాలేదు. అయితే వచ్చే నెలలో జరగబోయే పూణే షెడ్యూల్ కి అలియా అందుబాటులోకి వస్తుందా.. లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటుంటే.. ఇన్ని విషయాల మధ్యన రాజమౌళి మాత్రం తల పట్టుకుంటున్నాడట.