Advertisement
Google Ads BL

ఈ హీరోలిద్దరూ ‘వి’తో విలన్లు అయ్యారా?


ఈమధ్యన ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో హీరో, విలన్‌గా చేసిన వి ద మూవీ సినిమా విషయంలో ఆ ఇద్దరి హీరోస్ మధ్యన కోల్డ్ వార్ జరుగుతూ ఉంది అనే టాక్ వినబడింది. నాని విలన్ గా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘వి’ సినిమా రేపు ఉగాదికి విడుదల కావాల్సి ఉండగా.. కరోనాతో ఆ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే వి సినిమా ప్రమోషన్స్ లో నాని దూకుడుగా ఉంటే... సుధీర్ బాబు సైలెంట్ గా ఉండేవాడు. అయితే వి ని నాని తన సినిమాగా ప్రమోట్ చేసుకోవడంపై సుధీర్ బాబు అలిగి ఇంద్రగంటి మోహనకృష్ణ వద్ద పంచాయితీ పెట్టినట్లుగా టాక్ వినబడింది. అయితే నాని మాత్రం తన పిఆర్ టీం సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తుంది కాబట్టి అందులో తన తప్పేం లేదని సమర్ధించుకున్నాడని.. ఇక ఇంద్రగంటి కూడా నానికి ఫేవర్ గా ఉన్నప్పటికీ.. సుధీర్ బాబుకి సర్ది చెప్పినట్టుగా గుసగుసలు వినబడినాయి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సుధీర్ బాబు, నాని మీద కాస్త కినికు వహిస్తున్నాడని... నాని సోషల్ మీడియాలో తన టీం చేత వి సినిమా తనదే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటుంటే, సుధీర్ బాబు మాత్రం కరోనా ఎఫెక్ట్ తో కొన్ని ఛానల్స్ కి సోలోగా వి సినిమా మీద ప్రత్యేక ఇంటర్వూస్ ఇస్తున్నాడట. ఇప్పటికే సుధీర్ బాబు దర్శకుడుతో కలిసి ఎక్స్ట్రా జబర్దస్త్ కి గెస్ట్ గా వచ్చాడు కానీ.. అందులో నాని కనబడలేదు. నాని, సుధీర్ బాబు కలిసి సినిమా ప్రమోట్ చేయకపోవడంతో దర్శకుడు ఇంద్రగంటి తల పట్టుకుంటున్నాడట. హీరోగా నానితోను, సుధీర్ బాబు తోనూ విడివిడిగా సినిమాలు చేసిన ఇంద్రగంటి మీద గౌరవంతో అయినా వీరిద్దరు ప్యాచప్ అవ్వడం లేదని.. ఇద్దరూ బయటికి బాగానే మాట్లాడుకుంటున్నప్పటికీ వీరి మధ్యన కోల్డ్ వార్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు.

war between V movie Hero and Villain:

Hero nani vs Hero Sudheer Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs