Advertisement
Google Ads BL

కురచ దుస్తులపై సమంత క్లారిటీకి టేక్ ఏ బౌ!


నిజంగానే ఎవరైనా ధైర్యం తెచ్చుకుని మొదటి అడుగు వేస్తేనే అది సక్సెస్ అవుతుందా.. లేదా.. అనేది తెలుస్తుంది. అసలు అడుగు వెయ్యకముందే భయపడితే.. అది ఎప్పటికి సక్సెస్ దరి చేరనివ్వదు. ప్రస్తుతం ఈ మాట సమంత అక్కినేనికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన.. సమంత సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నే ఎదుర్కొంది. సమంత పెళ్ళికి ముందు ఎలాంటి పిక్స్ పోస్ట్ చేసినా.. గమ్మునున్న నెటిజెన్స్.. ఆమె పెళ్లి తర్వాత గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తే మాములుగా ట్రోల్ చేసేవారు కాదు.

Advertisement
CJ Advs

బికినీ పిక్స్, గ్లామర్ గర్ల్ లుక్స్ తో సమంత పిక్ సోషల్ మీడియాలో కనబడితే సమంతని తెగ ట్రోల్ చేసేవారు. అయితే ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా తగిన సమాధానం చెబుతూ ఎప్పటికప్పుడు అప్ డేట్ గా గ్లామర్ పిక్స్ ని వదిలే సమంత తనపై నెటిజెన్స్ చేసే ట్రోల్స్ విషయంలో తాజాగా తన స్పందన తెలియజేసింది. చైతుతో పెళ్లి తర్వాత బికినీ వేసుకున్నప్పుడు అందరి నుండి చాలా వ్యతిరేఖత ట్రోలింగ్ ఎదుర్కొన్నా. అప్పట్లో చాలామంది నన్ను అసభ్యకరమైన పదజాలంతో దూషించేవారు. అలాగే మొదటిసారి అలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్నప్పుడు చాలా బాధపడ్డా. చాలా రోజులు ఆ విషయాన్ని మరిచిపోలేకపోయా. తర్వాత రెండోసారి అలాంటి కురచ దుస్తులు వేసుకున్న ఫొటోస్ ని పోస్ట్ చేసినప్పుడు ఆ ట్రోలింగ్ కాస్త తగ్గింది. మొదట ఉన్నంత ట్రోలింగ్ జరగలేదు. తర్వాతర్వాత మరింతగా ట్రోల్స్ తగ్గాయి.

అప్పటినుండి నాకో విషయం అర్ధమైంది. మొదటి అడుగు వేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది.. కానీ ధైర్యం చేసి మొదటి అడుగు వేస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ టైం ట్రోలింగ్ కి గురైనప్పుడు భయపడ్డాను. తర్వాత వాళ్లలో మార్పు కోసం నేను ఎంత చెయ్యాలో అంతా చెయ్యాలని అనుకున్నాను అంటూ సమంత తనపై వచ్చే ట్రోల్స్ గురించి చెప్పుకొచ్చింది.

Samantha Talks About Exposing After Marriage:

Samantha Latest Interview Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs