తెలుగులో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. అయితే స్టార్ హీరోగా ఎదగడమంటే చిన్న విషయం కాదు. సినీ కుటుంబాల నుండి వచ్చినా కూడా ఒకేసారిగా స్టార్ డమ్ వచ్చి చేరదు. దానికి టైమ్ రావాలి. అలా రావాలంటే ఎంతో కష్టపడాలి. అలా టైమ్, కష్టం రెండింటి కలయిక వల్లే ఎవ్వరైనా స్టార్స్ అవుతారు. అయితే కొద్ది మందికి ఈ రెండు చాలా తొందరగా కలిసివచ్చి టక్కున స్టార్స్ అయిపోతారు.
అలా స్టార్ అయిన వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో అతను స్టార్ గా మారిపోయాడు. స్టార్ హీరోలకి ఎంతలా ఫాలోయింగ్ ఉంటుందో విజయ్ కి అంతకి తక్కువేమీ లేదు. ఈ ఫాలోయింగ్ ఎంతనేది కొన్ని కొన్ని సార్లు బయటపడుతుంటుంది. ప్రముఖ మ్యాజగైన్ హైదరాబాద్ టైమ్స్ 2019 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ ప్రకటించింది. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ ప్రథమ స్థానంలో నిలిచారు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్ ని వెనక్కి నెట్టి విజయ్ మొదటి స్థానంలో నిలవడం ఆశ్చర్యంగా ఉంది. రంగస్థలం సినిమాతో కెరీర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ రెండో స్థానంలో నిలిచారు. ఇక షాకింగ్ గా ఇస్మార్ట్ హీరో రామ్ ప్రభాస్ కంటే ముందు స్థానంలో ఉన్నాడు. ప్రభాస్ ఈ లిస్ట్ లో నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.