Advertisement
Google Ads BL

పవన్ ఫ్యాన్స్ ఆశలు ఆవిరి..!


కరోనా కారణంగా ప్రతీ ఒక్క ఇండస్టీ ఘోరంగా దెబ్బతింది. మహమ్మారిగా మారిన ఈ వైరస్ బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణిస్తుంది. మరో ఆర్థిక మాంద్యం దిశగా పయనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక కరోనా ప్రభావం చిత్ర పరిశ్రమపై  కూడా పడింది. సోషల్ డిస్టేన్స్ మెయింటైన్ చేయాలని చెప్పడంతో అన్ని షూటింగ్ లు ఆగిపోయాయి.

Advertisement
CJ Advs

అందులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా ఉంది. బాలీవు చిత్రమైన పింక్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ పేరుతో చిత్రం రూపొందుతుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ముఫ్పై రోజుల డేట్లని ఇచ్చాడట. పవన్ ఇచ్చిన డేట్ల ప్రకారం దిల్ రాజు చిత్ర షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా వాటన్నింటినీ తారుమారు చేసింది. 

దిల్ రాజు ప్లాన్ ప్రకారం అన్నీ సక్రమంగా జరిగితే మే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావించారు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్లు ప్లాన్ చేశారు కూడా. కానీ కరోనా రక్కసి తన ప్లానింగ్ తో వచ్చి అందరినీ డిస్టర్బ్ చేసేసింది. ఇప్పుడు చిత్ర షూటింగ్ ఆగిపోవడంతో మే నెలలో విడుదల అయ్యే ఛాన్సే కనిపించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తొలగిపోయి సినిమా మిగతాభాగం షూటింగ్ జరుపుకుని విడుదల కావాలంటే బాగానే టైమ్ పట్టేలా ఉంది. దీంతో మే నెలలో పవన్ సినిమా వస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులకి నిరాశే మిగిలింది.

Pawan Fans disappointed :

Due to corona effect pawan Vakeel saab will be late
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs