Advertisement
Google Ads BL

కరోనా ఎఫెక్ట్.. నిర్భందంలో తెలుగు కమెడియన్!


కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాలకు సైతం పాకడంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటికి రావాలన్నా.. బయటి దేశాలనుంచి ఇంటికి రావాలన్నా జంకిపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ పెద్దలు కూడా సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు, థియేటర్స్ సైతం బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో విద్యాసంస్థలు మొదలుకుని పబ్‌లు, జిమ్‌లు, షాపింగ్ మాల్స్ దాదాపు అన్నీ మూసేయించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. షూటింగ్‌లు అన్నీ బంద్ చేసుకుని ఇంటికే పరిమితం అవుతున్నారు.

Advertisement
CJ Advs

జార్జియా నుంచి వచ్చి..!

మరోవైపు ఈ కరోనా భయం కంటే ముందు విదేశాలకు షూటింగ్‌కు వెళ్లిన టాలీవుడ్ నటీనటులు హైదరాబాద్‌కు తిరిగొచ్చి ఇంటికే పరిమితం అవుతున్నారు. అంటే సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్భందం) అన్న మాట. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దే నటీనటులుగా వస్తున్న ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌ను జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ యూనిట్ హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. వీరితో పాటు కమెడియన్, నటుడు ప్రియదర్శి కూడా షూటింగ్‌లో ఇంటికి తిరిగొచ్చాడు.

నిర్భందంలో ఉన్నా!

కరోనా వైరస్‌పై ప్రియదర్శి పోరాటం చేస్తున్నాడు. నిర్భందంలో ఉన్న హాస్య నటుడు ప్రియదర్శి.. ఇటీవలే జార్జియాలో ప్రభాస్ సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయించుకున్నాడు. క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు తనకు తానుగా 14 రోజుల పాటు ప్రజలకు, బంధవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అని రాసి ఉన్న ఓ పోస్ట్‌ను సినీ క్రిటిక్ ఫణి కందుకూరి షేర్ చేశాడు. ప్రియదర్శి తీసుకున్న నిర్ణయం మంచిదేనని.. జనాల్లో తిరగకపోవడమే చాలా మంచి నిర్ణయమని నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రియులు ప్రశంసిస్తున్నారు.

Corona Effect.. Tollywood Comedian self quarantine!:

Corona Effect.. Tollywood Comedian self quarantine!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs