Advertisement
Google Ads BL

RRRపై ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ హ్యాపీనే!


ప్రస్తుతం కరోనాతో RRR షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. చరణ్ దెబ్బ, ఎన్టీఆర్ దెబ్బలు, మధ్యలో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి అలాగే చరణ్ సై రా నరసింహారెడ్డి ప్రమోషన్స్ వలన RRR షూటింగ్ అనుకున్న టైం కన్నా చాలా ఆలస్యంగా జరగడంతో షూటింగ్ మందకొడిగా సాగడంతో జులైలో విడుదల కావాల్సిన సినిమా కాస్తా వచ్చే ఏడాది జనవరి పోస్ట్ పోన్ అయితే ప్రస్తుతం కరోనా ప్రభవంతో ఈ సినిమా మళ్ళీ ఎక్కడ పోస్ట్ పోన్ అవుతుందో అనే కంగారులో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే కరోనా ప్రభావంతో అవుట్ డోర్ షూట్స్ ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా RRR షూటింగ్ పెద్దగా బ్యాలెన్స్ లేదని.. కేవలం క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ (కొమరం బీమ్) - చరణ్( అల్లూరి సీతారామరాజు) కలయికలో విలన్స్ పై చేసే యాక్షన్ సీన్స్ తప్ప, ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలయికలోని తెరకెక్కాల్సిన మిగిలిన భాగం అంతా షూటింగ్ పూర్తయిపోయిందని తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ కంగారు పడక్కర్లేదని RRR షూటింగ్ వాయిదా పడినప్పటికీ రాజమౌళి తన టీం చేత RRR గ్రాఫిక్స్ పనులను చకచకా పూర్తి చేస్తాడని అంటున్నారు. పాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఎప్పుడుబడితే అప్పుడు సినిమా విడుదల వాయిదా వెయ్యడం బాగోదు కనక రాజు ఈసారి పక్కాగా జనవరి 8 న RRR విడుదల చేయడం పక్కా అంటున్నారు.

Fans Happy with RRR Movie Latest Update :

Only Climax Shoot Balance to RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs