Advertisement
Google Ads BL

‘చిత్రం X’ ఫస్ట్ లుక్ విడుదల


నిర్మాత రాజ్ కందుకూరి చేతులమీదుగా ‘చిత్రం X’ ఫస్ట్ లుక్ విడుదల

Advertisement
CJ Advs

శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో, బేబీ రాజశ్రీ సమర్పణలో.. రాజ్ బాల, మానస హీరో హీరోయిన్లుగా రమేష్ వీభూది దర్శకత్వంలో పొలం గోవిందయ్య నిర్మించిన సినిమా ‘చిత్రం X’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని సక్సెస్ ఫుల్ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ విడుదల అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ... ‘‘ చిత్రయూనిట్‌కు నా అభినందనలు. కొత్త డైరెక్టర్స్ అయినా మంచి కంటెంట్‌తో, జాగ్రత్తగా సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని అందిస్తారు. ఈ చిత్రం మంచి కంటెంట్‌తో తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.  

చిత్రం నిర్మాత పొలం గోవిందయ్య మాట్లాడుతూ... ‘‘మా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరిగారికి ధన్యవాదాలు. డైరెక్టర్ చెప్పిన కథ ఎంతగానో నచ్చింది. ఖచ్చితంగా మంచి విజయం సాధింస్తుందని అనిపించింది. అందుకే ఈ చిత్రాన్ని నేనే నిర్మించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి సినిమా నిర్మించినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు రమేష్ వీభూది మాట్లాడుతూ... ‘‘రాజ్ కందుకూరిగారికి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు ప్రేక్షకులు అన్ని భాషల్లో వచ్చిన ఎన్నో హర్రర్ ఫిలిమ్స్ చూసి ఉంటారు. మా సినిమా వాటన్నిటికీ భిన్నంగా ఉంటుంది. నటీనటులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవసరమైనచోట గ్రాఫిక్స్ కూడా వాడాము. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

హీరో రాజ్ బాల మాట్లాడుతూ... ‘‘ఇంత మంచి సినిమాలో నాకు హీరోగా చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. భయంకరమైన అడవిలో నెల రోజుల పాటు ఈ సినిమా కోసం పని చేశాము. చిత్రీకరణ పూర్తయింది. ప్రొడ్యూసర్ ప్రోత్సహం, డైరెక్టర్ తపన చూసి నాతో పాటు నటీనటులందరూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించాము. సినిమా సూపర్‌గా వచ్చింది. పాటలు, ఫైట్స్ అదిరిపోతాయి’’ అని అన్నారు.

రాజ్ బాల, మానస హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో పలాస శ్రీను, బాచి, సునీల్ రావినూతల, శ్యాం పిల్లలమర్రి, ఆనంద్, వినోద్, 150 రఫీ, చందన, వాణి, కావ్య, కల్పన ఇతర తారాగణం.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె కావలి, మ్యూజిక్: శివ ప్రణయ్, డాన్స్: కపిల్ మాస్టర్, ఫైట్స్: అంజి మాస్టర్, నిర్మాత: పొలం గోవిందయ్య, దర్శకత్వం: రమేష్ వీభూది. 

Chitram X Movie First Look Released:

Raj Kandukuri Released Chitram X Movie First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs