ఈ ఏడాది సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పెంచిన తండ్రి కొడుకుల మధ్యన జరిగే వార్ ని ఫన్నీగా మార్చి అలా వైకుంఠపురములో తీసాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో మురళి శర్మ తనకొడుకు సుశాంత్ వైకుంఠపురములో ఉండాలి అని పిల్లల్ని మార్చేసి.. టబు కొడుకు అల్లు అర్జున్ ని తన దగ్గరపెట్టుకుని నానా చాకిరీ చేయిస్తుంటాడు. మధ్యలో అల్లు అర్జున్ బంటుకి అసలు విషయం తెలిసి మురళి శర్మని ఆడుకుంటాడు. అందులో భాగంగానే సుశాంత్ ని టార్గెట్ చేస్తాడు. కానీ సుశాంత్ ని టార్గెట్ చేసిన చాలా సీన్స్ ని ఎడిటింగ్ లో లేపేశారు లెన్త్ ఎక్కువైంది అని. కానీ తాజాగా అల వైకుంఠపురములో డిలేటెడ్ సీన్స్ అంటూ ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో వదులుతున్నారు.
అందులో భాగంగా సుశాంత్ ని స్విమ్మింగ్ పూల్ దగ్గర అల్లు అర్జున్ ఫోన్ చూపించి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటా అంటూ అందులో సుశాంత్ దమ్ము కొడుతూ.. అర్జున్ రెడ్డి స్టయిల్లో మందు తాగుతూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో వాడిన అర్జున్ రెడ్డి బ్యాగ్రౌండ్ కూడా కెవ్వుకేక. అయితే అది తీసి టైటిల్ గా అర్జున్ రెడ్డి 2 పెడదామనుకున్నఅంటూ సుశాంత్ ని తాను చెప్పినట్లుగా పనులు చేయిస్తాడు. ఆ వీడియో అడ్డం పెట్టుకుని సుశాంత్ ని రోడ్ మీద పరిగెత్తిస్తూ బస్ ఎక్కాలని.. అల్లు అర్జున్ మాత్రం కార్ లో ఉండి సుశాంత్ ని బస్ వెనక పరిగెత్తించాడు అపుడు చూడాలి అబ్బా మురళి శర్మ అయితే ఎంతగా ఉడికిపోయాడో అర్ధమవుతుంది. మరి అల వైకుంఠపురములో సినిమా హిట్. మళ్ళీ ఈ డిలేటెడ్ సీన్స్ మరో హిట్ అన్నట్టుగా ఉన్నాయి.