Advertisement
Google Ads BL

పవన్ ‘వకీల్‌ సాబ్‌’ మూవీలో అన్నయ్య..!


టైటిల్ చూడగానే ఆశ్చర్యంగా ఉంది కదూ..? అవును మీరు వింటున్నది నిజమే.. కానీ మీరు అనుకున్నట్లుగా ‘అన్నయ్య’ అంటే మెగాస్టార్ చిరంజీవి కాదండోయ్.. పవన్ చిన్న అన్నయ్య, మెగా బ్రదర్ నాగబాబు. ఈయన చాలా రోజులుగా వెండి తెరకు దూరమై.. బుల్లితెరకే పరిమితమైన మెగా బ్రదర్‌ను.. అభిమానులు త్వరలోనే థియేటర్లలో చూడబోతున్నారు. ఓ స్పెషల్ రోల్‌లో నాగబాబు ‘వకీల్ సాబ్’లో చేయబోతున్నాడట. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘లాయర్’ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నాగబాబుకు ఓ మంచి పాత్ర అడిగి మరీ పవన్ ఇప్పించారనే వార్త ఫిల్మ్‌ నగర్‌లో కోడై కూస్తోంది. వాస్తవానికి ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు చాలా అరుదు. అందుకే ‘అన్నయ్య’ను తన సినిమాలోకి పవన్ తీసుకున్నారట.

Advertisement
CJ Advs

కాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తిరుమల వెంకన్న సన్నిధిలో చెప్పినట్లుగానే మార్చి 2న ఫస్ట్ లుక్, టైటిల్‌ను సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ లుక్‌ కూడా సెన్సేషనల్ అయ్యింది.

అయితే.. సినిమా ఎలా ఉంటుంది..? రీమేక్ గనుక సేమ్ టూ సేమ్ దింపేస్తారా..? లేకుంటే మార్పులు చేర్పులు ఏమైనా చేశారా..? అసలు సినిమాలో ఎవరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయ్..? సినిమాలో పవన్‌ కల్యాణ్ హైలైట్‌గా నిలుస్తాడా..? లేకుంటే మరొకరెవరైనా..? అనే విషయాలపై పవన్ భక్తులు, టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో పైన చెప్పబడిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో నిజానిజాలెంటో తెలియాలంటే అధికారిక ప్రకటన లేదా సినిమా రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడక తప్పదు మరి. 

Annayya Special Role In Pawan Vakeel Sab Movie!:

  Annayya Special Role In Pawan Vakeel Sab Movie!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs