Advertisement
Google Ads BL

‘వకీల్ సాబ్’ను మెగా ఫ్యామిలీ పట్టించుకోలేదేం!

vakeel sab,pink remake,pawan,pawan kalyan,mega heros,mega family,chiranjeevi | ‘వకీల్ సాబ్’ను మెగా ఫ్యామిలీ పట్టించుకోలేదేం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్‌ సాబ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ లుక్ ఎలా ఉంటుంది..? సినిమా ఎలా ఉండబోతోంది..? సినిమాలో నటీనటులు ఎవరు..? అనేదానిపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి చెక్ పెడుతూ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను వదిలాడు. ఈ లుక్ నాలుగైదు రోజులపాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎంతో మంది నటీనటులు, డైరెక్టర్స్ ఈ లుక్‌పై స్పందించారు. అంతేకాదు ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ ప్రోమో.. పూర్తి సాంగ్‌పై టాలీవుడ్ ప్రశంసలు దక్కాయి. ఆ సాంగ్ కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. ‘వకీల్ సాబ్’ విషయంలో ఇంత జరుగుతున్నా మెగా హీరోలు ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. అంతేకాదు కనీసం సోషల్ మీడియా వేదికగా ఈ పిక్‌ను షేర్ చేసిన దాఖలాల్లేవ్. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన దగ్గరికి వచ్చిన సినిమా వాళ్ల సాంగ్స్, టీజర్‌ను రిలీజ్ చేసి బ్లెస్ చేశాడు కానీ.. ‘వకీల్ సాబ్’ను మాత్రం అస్సలంటే అస్సలే పట్టించుకోలేదు. చిరును పక్కనెడితే మెగా హీరోలు సుమారు డజను మంది ఉన్నారు కదా.. వీళ్లయినా పట్టించుకున్నారా..? అంటే అస్సలే లేదు. సాంగ్స్, లుక్సే కదా..? సినిమా రిలీజ్ అయ్యాక అసలు సినిమా చూపిద్దామని మెగా హీరోలు సైలెంట్‌గా ఉన్నారా..? లేకుంటే ‘పవర్ స్టార్’కు మనం ప్రమోషన్ ఇచ్చే రేంజ్ కాదని మిన్నకుండిపోయారా..? అనేది మాత్రం తెలియరాలేదు. 

ఏదైతేనేం.. సినిమా షూటింగ్ పూర్తయ్యాక.. తదుపరి కార్యక్రమాలు అనగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఫస్ట్ షో, సక్సెస్ మీట్స్, థ్యాంక్స్ మీట్స్ ఇలా చాలానే ఉన్నాయ్ కదా.. అప్పుడైనా అన్నయ్య చిరు తళుక్కుమంటారో లేకుంటే ఎన్నికల్లో మాదిరిగా అస్సలే పట్టించుకోకుండా ఉండిపోతారో తెలియాల్సి ఉంది. కాగా.. వీలైనంత త్వరగానే షూటింగ్ పూర్తి చేసుకుని మరో సినిమాలో నటించాలని పవన్ తెగ తొందరపడుతుండగా.. దిల్ రాజు మాత్రం ఎప్పుడు షూటింగ్ అయిపోతుందా..? థియేటర్స్‌‌కు తెచ్చేద్దామా..? అని సంబరపడిపోతున్నాడు. మరి ఫైనల్‌గా ఎప్పుడేం జరుగుతుందో వేచి చూడాలి.

News About Vakeel Sab, Mega Family!!:

News About Vakeel Sab, Mega Family!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs