Advertisement
Google Ads BL

కోవిడ్- 19 పై RRR హీరోల యుద్ధం?


కరోనా ప్రభావంతో.. బడా సినిమా, చిన్న సినిమా షూటింగ్ వాయిదా పడ్డాయి. చాలామంది నష్టపోతున్నప్పటికీ... కోవిడ్ 19 కి భయపడి చాలావరకు అందరూ ఇళ్లలో ఉండడానికి డిసైడ్ అవుతున్నారు. కొంతమంది కరోనాపై తప్పుడు పబ్లిసిటీ చేస్తు భయపెడుతున్నారు. అందుకే ఇప్పుడు కరోనా వ్యాప్తి అరికట్టేందుకు సినిమా ప్రముఖులు రంగంలోకి దిగారు. అందులో ముఖ్యంగా పాన్ ఇండియా ఫిలిం RRR హీరోలు ఎన్టీఆర్ -రామ్ చరణ్ లు కరోనా వ్యాప్తి చెందకుండా ఓ ఆరు చిట్కాలు చెబుతున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ స్పెషల్ గా చేసిన కరోనా వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అయ్యింది. కొమరం భీం - అల్లూరి పాత్రలు చేస్తున్న - ఎన్టీఆర్ - రామ్ చరణ్ కరోనా వ్యాప్తి చెందకుండా WHO వారు చూపిన కొన్ని పద్దతులను ఫాలో అవ్వమంటున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్  - రామ్ చరణ్ అందరికి నమస్కారం చేస్తూ..

రామ్ చరణ్ మాట్లాడుతూ.. WHO సూచించిన ఈ ఆరు సూత్రాలు పాటిస్తే కోవిడ్ 19 నుండి మనం చాలా సులువుగా బయటపడగలం.

ఎన్టీఆర్: చేతులు సబ్బుతో.. మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ళ సందుల్లో కూడా. బయటికి వెళ్ళొచ్చినప్పుడో .. లేదా భోజనానికి ముందో.. ఇలా రోజుకి 7 నుండి 8 సార్లు సబ్బుతో చేతులు కడుక్కోండి.

రామ్ చరణ్: కరోనా వైరస్ తగ్గేవరకూ తెలిసిన వాళ్ళు ఎదురు పడితే.. హగ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం మానెయ్యాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేళ్ళు పెట్టుకోవడం కూడా మానెయ్యాలి.

ఎన్టీఆర్: పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్ లు వేసుకోవాలి, ఇవి లేకుండా వేసుకుంటే.. అనవసరంగా కోవిడ్ 19 మీకంటుకునే ప్రమాదముంది. ఇంకో ముఖ్యమైన విషయం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిలో కాకుండా.. మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.

రామ్ చరణ్: మనుషులు ఎక్కువగా ఉండేచోటికి వెళ్ళకండి, మంచి నీళ్లు ఎక్కువ తాగండి. గడగడా అని ఒకేసారితాగే కన్నా.. ఎక్కువసార్లు కొద్దీ కొద్దిగా సిప్ చెయ్యండి. వేడి నీళ్ళైతే ఇంకా మంచిది.

ఎన్టీఆర్: వాట్స్ అప్ లో వచ్చే ప్రతి వార్తని నమ్మేయ్యకండి. దానిలో నిజమెంతుందో తెలియకుండా ఫార్వర్డ్ చెయ్యకండి. అనవసరంగా పానిక్ సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదం. WHO వెబ్సైటు లో వచ్చే సూచనలు ఫాలో అవ్వండి.

రామ్ చరణ్: కోవిడ్ 19 మీద గవర్మెంట్ ఇచ్చే సలహాలు, సూచనలు తప్పకుండా పాటిద్దాం మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం.

అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సమాజానికి పనికొచ్చే 6 సలహాలు, సూచనలు ప్రజలు ఆభిమానుల కోసం అందజేశారు.

Click Here for Video

RRR Heroes Preventive Measures on Corona Virus:

<span>Ram Charan and Jr NTR Released video on Covid 19</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs