Advertisement
Google Ads BL

పవన్, విశాల్‌.. సేమ్ కాన్సెఫ్ట్‌తో.. !


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటుగా క్రిష్ తో మరో చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. అయితే క్రిష్ తో తెరకెక్కబోయే సినిమా మొఘలాయిల కాలంనాటి కోహీనూర్ డిమాండ్ చుట్టూ కథ తిరుగుతుంది అని.. పవన్ కళ్యాణ్ దొంగగా కోహినీర్ వజ్రాన్ని కొట్టేసేవాడి పాత్రలో నటిస్తున్నాడంటూ... ఏవేవో కథలు ప్రచారంలోకొచ్చాయి. అయితే తాజాగా మరో సినిమాకూడా పవన్ - క్రిష్ స్టోరీ లైన్ మాదిరిగానే కనబడుతుంది. అది కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ డిటెక్టీవ్ 2 సినిమా. విశాల్ డిటెక్టీవ్ 2 మిస్కిన్ డైరెక్టర్ గా మొదలై చివరికి మిస్కిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో విశాల్ దర్శకత్వంలో ఈ సినిమా పూర్తయ్యింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మిస్కిన్ విశాల్ మీద తీవ్ర ఆరోపణలతో పాటుగా డిటెక్టీవ్ కథను చూచాయగా బయటపెట్టాడు. విశాల్ డిటెక్టీవ్ తర్వాత మళ్ళీ నన్ను కలిసి మరో మంచి కథతో రమ్మంటే.. నేను కోహినీర్ వజ్రాన్ని దొంగతనం చేసే నెమధ్యమున్న కథ చెప్పగా విశాల్ కి నచ్చి సినిమా ఒకే చేసాడని.. అయితే ఈ సినిమాని నేనే నిర్మిస్తా అని విశాల్ అంటే వద్దు ఇప్పటికే అప్పుల్లో ఉన్నావ్ వేరే నిర్మాతతో సినిమా చేద్దామంటే కాదు కూడదు అని విశాల్ నిర్మాతగా సినిమా మొదలెట్టమని.. కానీ విశాల్ మాత్రం తనకి రెమ్యునరేషన్  ఇవ్వకుండా తన తల్లిని, తమ్ముడిని అసభ్యపదజాలంతో దూషించాడని విశాల్ డిటెక్టీవ్ 2 కథని రివీల్ చేసాడు. మరి పవన్ క్రిష్ సినిమా మొదట్లోనే ఉండగానే.. విశాల్ సినిమా పూర్తయ్యింది. అలాంటప్పుడు క్రిష్ మళ్ళీ తన కథలో మార్పులు ఏమైనా చేస్తాడేమో చూడాలి.

Pawan Kalyan and Vishal Movies in Same Concept:

Pawan and Vishal Fight for kohinoor Diamond
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs