తెలుగులో హీరోయిన్లకి పెద్దగా ప్రాధాన్యం ఉండదనేది టాక్. పూర్తిగా కాకపోయినా కొంత అది నిజం కూడా. కథలన్నీ హీరో చుట్టూతా తిరగాడుతూ ఉంటాయి కాబట్టి హీరోయిన్లని కేవలం గ్లామర్ డాల్స్ గానే వాడతారు. అందుకే మన సినిమాల్లో హీరోయిన్లు అందరూ తెల్లగా ఉంటారు. తెల్లగా ఉన్నవారే హీరోయిన్లుగా పనిచేస్తారు అనే భ్రమ కూడా కలిగిందందుకే. నల్లగా ఉంటే డస్కీ స్కిన్ అని కొన్ని కొన్ని పాత్రలకే పరిమితం చేసేస్తారు. ఎక్కడా లేని ఈ అనవసర క్యాలిక్యులేషన్స్ మన దగ్గర మాత్రం ఎందుకో అర్థం కాదు.
డస్కీ స్కిన్ వల్ల ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్న వారిలో ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్ కూడా చేరింది. ఐశ్వర్యా రాజేష్ తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే ఆమె రంగు వల్ల అక్కడ కూడా అనేక విమర్శలు ఎదుర్కొంది. అయినా కూడా లేచి నిలబడగలిగింది. తెలుగులో కౌసల్య క్రిష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో తనలోని ప్రతిభని చూపించింది. అయితే ఆ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమెకి కలిసిరాకుండా పోయింది.
ప్రస్తుతం ఈ భామ నాని సరసన టక్ జగదీష్ చిత్రంలో నటిస్తుందట. మరి ఈ సినిమాతోనైనా ఐశ్వర్యని గుర్తిస్తారేమో చూడాలి