Advertisement
Google Ads BL

అవి రెండూ ఆగిపోతే పరశురామ్ పరిస్థితేంటి?


ప్రస్తుతం టైటల్ ని చూస్తుంటే ఆ టైటిల్ దర్శకుడు పరశురామ్ కి యాప్ట్ అయ్యేలా కనబడుతుంది. ఎందుకంటే మహేష్ కోసం చూసి చూసి నాగ చైతన్యతో 14 రీల్స్  బ్యానర్ తో సినిమాకి కమిట్ అవడం చైతు - పరశురామ్ ల సినిమా మీద అధికారిక ప్రకటన రావడం జరిగిది. అయితే అనుకోకుండా మహేష్ - వంశి పైడిపల్లి మూవీ ఆగిపోవడంతో పరశురామ్ కి మహేష్ నుండి ఫోన్ రావడం ఆ సినిమాని వేరే నిర్మాతలతో చెయ్యాలనే కండిషన్ మీద మహేష్ పరశురామ్ తో కథ సిద్ధం చెయ్యమనడంతో. పరశురామ్ ఉత్సాహంతో మహేష్ కోసం కథని రెడీ చేస్తున్నాడు. మహేష్ ని అంత సాధారణంగా కథతో మెప్పించడం పూరి, సుకుమార్, వంశి వల్లే కాలేదు. పరశురామ్ వల్ల ఏమవుతుందో అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఇకపోతే మహేష్ సినిమా ఆలోచనలతో పరశురామ్ తన కథకు మెరుగులు దిద్దుతూ.. ఇటు చైతూతో సినిమా విషయాన్నీ పక్కనబెట్టిన అటు 14 రీల్స్ కి కానీ, ఇటు చైతుకి కానీ చెప్పలేదు. దానితో చైతు ఎటువంటి టెన్షన్ లేకుండా శేఖర్ ఖమ్ములతో  లవ్ స్టోరీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తర్వాత పరశురామ్ తో సినిమా అనుకుంటుంటే పరశురామ్ మాత్రం మహేష్ కథ మీద కుస్తీలు పడుతున్నాడు. మరోపక్క 14 రీల్స్ వారు పరశురామ్ చెప్పాపెట్టకుండా మహేష్ సినిమాకి వర్క్ చేసుకుంటున్నాడని మండిపడుతున్నారట. మరి చైతుతో సినిమా ఆపేసినట్టుగా పరశురామ్ చెప్పాడంటే. మరోపక్క మహేష్ పరశురామ్ కథకి ఇంప్రెస్ అవ్వకపోయినట్లయితే పరశురామ్ అటు చైతుతో సినిమా ఇటు మహేష్ తో సినిమా వదులుకోవాలి. అందుకే మహేష్ తో కథ వర్కౌట్ అవ్వకపోతే చైతుతో సినిమా చేసుకుందామని పరశురామ్ తెలివిగా ఆలోచిస్తున్నాడు. కానీ మధ్యలో ఏదైనా జరిగి రెండు సినిమాలు ఆగిపోతే పరశురామ్ మాత్రం రెండికి చెడ్డ రేవడిలా తయారవడం ఖాయం.

Director Parasuram in Confusion Mod:

Parasuram Movies with Mahesh and Naga chaitanya
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs