Advertisement
Google Ads BL

‘ఒరేయ్‌ బుజ్జిగా..’ రెండున్నర గంటలు నవ్విస్తాడట!


రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా...’- కరీంనగర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో రాజ్ తరుణ్.

Advertisement
CJ Advs

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో  శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై విజయ్‌కుమార్ కొండ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నయూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా క‌రీంన‌గ‌ర్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్య‌క్ర‌మానికి కరీంనగర్ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజ‌రై ‘ఒరేయ్‌ బుజ్జిగా...’ ఆడియో బిగ్ సీడీని విడుద‌ల‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, కార్పోరేటర్ బోనాల శ్రీకాంత్, మహేష్, కరీంనగర్ న‌గ‌ర‌ అడిషనల్ డిసిపి చంద్ర మోహన్, ఎసిపి శంకర్ రాజు, ఇన్‌స్పెక్ట‌ర్‌ దేవారెడ్డి, దామోదర్ రెడ్డి, మరియు చిత్ర యూనిట్ పాల్గొంది. 

చిత్ర నిర్మాత కె.కె రాధా మోహన్ మాట్లాడుతూ - ‘‘కరీంనగర్ వచ్చి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆర్ఇసి వరంగల్ లో చదువుకున్న మీ తెలంగాణ బిడ్డను. ఇది నిర్మాతగా నా ఎనిమిదవ సినిమా. ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన‌ర్‌. చక్కని టీమ్‌ ఎఫర్ట్ వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. హీరో రాజ్‌ తరుణ్,  ద‌ర్శ‌కుడు విజ‌య్‌ కుమార్‌,  హీరోయిన్ మాళవిక నాయర్, అనూప్ రూబెన్స్‌, ఆండ్రూ, ప్ర‌వీణ్ ఇలా మంచి మంచి టెక్నీషియ‌న్స్ ఈ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. ముందుగా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేద్దాం అనుకున్నాం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదేశానుసారం ఈనెల 21 వరకు థియేటర్స్ మూసివేస్తున్నారు కాబట్టి తిరిగి ఓపెన్ చేయగానే విడుదల తేదీని ప్రకటిస్తాం. సినిమా  మీ అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నాను.  ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్ లోనే చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కరీంనగర్ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ - ‘‘దర్శకుడు విజయ్ కుమార్ ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’ సినిమా చూశాను. చాలా చక్కగా తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా  రాధా మోహన్ గారు నిర్మిస్తున్న ‘ఒరేయ్ బుజ్జిగా’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ‘‘థియేటర్ కి వచ్చి ఫ్యామిలీ అంతా రెండున్నర గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అన్నారు.

చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండ మాట్లాడుతూ -  ‘‘ఒరేయ్ బుజ్జిగా..’ ఒక క్లీన్ ఎంటర్టైనర్. రెండున్నర గంటలు మిమ్మల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం. ఫైనల్ ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. రాజ్ తరుణ్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీశాడు. అనూప్ దేనికదే ఉండేలా అన్ని డిఫరెంట్ ట్యూన్స్ ఇచ్చారు. అలాగే రాహుల్ కృష్ణవేణి పాట బాగా పాడాడు. ఆ పాట చిత్రీకరణ కూడా బాగా కుదిరింది. మా నిర్మాత రాధా మోహన్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయనకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను.’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ‘‘ఒరేయ్ బుజ్జిగా..’ సాంగ్స్ మీ అందరికీ నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. ‘గుండెజారిగ‌ల్లంత‌య్యిందే’, ‘ఒక లైలా కోసం’ తర్వాత డైరెక్టర్ విజయ్ కుమార్ గారితో ఇది నా హ్యాట్రిక్ ఫిల్మ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మా నిర్మాత రాధా మోహన్ గారు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మంచి నిర్మాత. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజ్ తరుణ్ తో నా రెండవ సినిమా. రాజ్ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. డెడికేటెడ్ పెర్ఫార్మర్. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ - ‘‘రాజ్ తరుణ్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తడు. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్. ఒరేయ్ బుజ్జిగా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

నటుడు మధు సూధన్ మాట్లాడుతూ - ‘‘ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కావడానికి మీ అందరి బ్లెస్సింగ్స్ చాలా అవసరం’’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజారవీంద్ర, అజయ్‌ఘోష్‌, అన్నపూర్ణమ్మ‌, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:  విజయ్‌కుమార్ కొండ.

Orey Bujjiga Gives You A Two and A Half An Hour Laughter Ride:

Celebrities Speech at Orey Bujjiga Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs