Advertisement
Google Ads BL

కరోనాపై పోరాటానికి సినిమా వాళ్ళు ఒక్కటైనారు!


>కరోనాపై పోరాటానికి సినిమా వాళ్ళు ఒక్కటైనారు!

Advertisement
CJ Advs

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రెస్ మీట్ తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, సెక్రెటరీ జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ లు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, నట్టి కుమార్, ట గుర్ మధు, రామా సత్యన్నారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసన్న కుమార్.. సినిమా షూటింగ్ లను తక్షణం వాయిదా వేస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది, మరింత అప్రమత్తత అవసరం. కరోనా మహమ్మారి నియంత్రణ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న చర్యలు  కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా సినిమాలు వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం శ్రద్ద చూపిస్తుంది. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలి.అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.

నిర్మాత దామోదర్ ప్రసాద్.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా సంయుక్తంగా చిత్రీకరణ నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బంది ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవని తెలిపారు. 

బెనెర్జి.. కరోన వైరస్ చాలా ఫాస్ట్ గా  స్ప్రెడ్ అవుయుంది. కావున తెలంగాణ గవర్నమెంట్ అందరికీ ఉపయోగంగా ఉండాలని.. ఆర్డర్ చేసింది. దానివల్ల షూటింగ్స్ 21 వరకు బంద్ చేయడం జరుగుతుంది. 

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. మాకు సినిమా థియేటర్లు, షూటింగ్స్ ఇంటర్నల్ గా లింక్స్ ఉంటాయి కాబట్టి. దానివల్ల గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ వల్ల మేము వారికి సపోర్ట్ గా నిలుస్తూ.. బంద్ చేస్తున్నాం. ఇలాంటి స్విచ్యువేషన్ వచ్చినా ఔట్ డోర్ లో ఉన్న వారికి మా సైడ్ ఇబ్బంది లేదు.. కొంత మంది నిర్మాతలు పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు. షూటింగ్స్ ఎక్కడ జరగకూడదని అన్నీ క్రాఫ్ట్స్ వారు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. 

జీవిత మాట్లాడుతూ.. ఇది ఏఒక్కరి నిర్ణయం కాదు. అందరం కలిసి నిర్ణయం తీసుకున్నారు. మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సోషల్ రెస్పాన్స్ బిలిటీ గా ఫీలయి బంద్ చేస్తున్నాం. 

కొమర వెంకటేష్.. సినీ కార్మికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని అందరం ఏకగ్రీవంగా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు మళ్ళీ ఎప్పుడు నుండి స్టార్ట్ చెయ్యాలనేది చెపుతాం.

నారాయణ్ దాస్ నారంగ్.. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ మరియు ఆంధ్ర షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ సహకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు.

The film makers had a fight against Corona!:

 The film makers had a fight against Corona!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs