Advertisement
Google Ads BL

RRRలో జూనియర్ మూడు గెటప్స్.. నిజమా!?


‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమా కూడా బాహుబలిని మించిపోతుందని.. భారీగానే అంచనాలున్నాయ్. అంతేకాదు ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటంతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయ్యాయ్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి లుక్స్ రానప్పటికీ.. అప్పుడప్పుడు లీక్స్ వస్తుండటంతో వాటిని చూసి సినీ ప్రియులు, చెర్రీ-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముచ్చటపడిపోతున్నారు. అయితే సినిమాలు పాత్రధారుల గురించి తెలిసినప్పటికీ మూవీ ఎలా ఉంటుంది..? జక్కన్న ఎలా చెక్కబోతున్నాడు..? అనేది తెలియరాలేదు.

Advertisement
CJ Advs

తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ షాకింగ్ విషయం వెలుగుచూసింది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో భీమ్ గెటప్‌లోనే కాకుండా మరో రెండు గెటప్స్‌లో కనిపిస్తాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ఈ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతాయని లుక్స్‌తో పాటు యాసతో కూడిన డైలాగ్స్ హైలెట్‌గా నిలుస్తాయట. మరోవైపు జూనియర్ పాత్రకు చెర్రీ పాత్ర ఏ మాత్రం తగ్గకుండా ఉందట. సో.. మల్టీస్టారర్ మూవీకి ఇద్దరికీ జక్కన్న తగిన న్యాయం చేస్తున్నాడన్న మాట. మరి ఈ ట్రిపుల్ రోల్ విషయంలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.

 

RRR Junior Three Roles.. Is Its True!:

Gossips on jr ntr Role in RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs