Advertisement
Google Ads BL

కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత: చిరంజీవి


కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత నా సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నా - చిరంజీవి

Advertisement
CJ Advs

కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హల్స్‌ను, మాల్స్‌ను మూసివేడయం, స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కాబట్టి ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అకవాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉధ్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నానన్నారు. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరం.... మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి

నా సినిమా షూటింగ్ లను తక్షణం వాయిదా వేస్తున్నాం

ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది, మరింత అప్రమత్తత అవసరం

కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ద్విముఖ వ్యూహం: కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం ముదావహం

కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వాములు కావాలి

అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీస్కుంటున్నందుకు ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ముందస్తు నివారణా చర్యలు ప్రారంభించినట్టు తెలుసుకున్నా. పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నాను

కాగా సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదావేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను.

ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న నా సినిమా షూటింగ్ ని వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివ తో చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారు

ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నాను, అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను

మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi Message on Corona:

My Movie Shooting Also Stopped Says Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs