అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు చిత్రం యావరేజ్ గా నిలిచింది. ప్రేమించిన అబ్బాయితో కూతురు లేచిపోతే ఆ తండ్రి పడే బాధ ఎలా ఉంటుందో చెప్పిన చిత్రమిది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన షీలా హీరోయిన్ గా నటించింది. 2006 లో సీతాకోక చిలుక సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన షీలా చాలా తక్కువ చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలన్నింటిలో చెప్పుకోదగ్గ చిత్రాలు రెండే రెండు. ఒకటి పరుగు, మరోటి అదుర్స్.
ఈ రెండింటిలో అదుర్స్ బ్లాక్ బస్టర్ గానిలిస్తే పరుగు యావరేజ్ అనిపించుకుంది. అయితే ఈ రెండూ మంచి చిత్రాలే అయినా కూడా ఆమె కెరీర్ అనుకున్నట్లుగా సాగలేదు. చాలామంది హీరోయిన్ల లాగే ఒకటి రెండు సినిమాలతో క్లోజ్ అయిపోయింది. ఇన్ని రోజులు అటు సినిమాల్లోనూ, వార్త్తల్లోనూ కనిపించని షీలా సడెన్ గా ప్రత్యక్షమయింది. రెండురోజుల క్రితం సంతోష్ రెడ్డి అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. చెన్నై వేదికగా జరిగిన ఈ వేడుకలో ఆమె దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు.