పవన్ కళ్యాణ్ రోజుకి ఇంత పారితోషకం తీసుకుంటున్నాడు. గంటకింతని వసూలు చేస్తున్నాడు, 45 రోజుల కాల్షీట్స్‌కి 50 కోట్లు తీసుకుపోతున్నాడు అంటూ.. అబ్బో మీడియాలో చాలారకాల వార్తలు వచ్చాయి. దిల్ రాజు పింక్ రీమేక్ షూటింగ్ పవన్ చాలా త్వరగానే ఫినిష్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఒప్పించి తెచ్చుకున్నాడు కాబట్టి దిల్ రాజు 50 కోట్లు ఇస్తున్నాడు. అలాగే రీ ఎంట్రీ మూవీ కాబట్టి ఆ సినిమాకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. లాభాలొస్తాయి. ఇక పవన్ వకీల్ సాబ్ లో పాత్ర నిడివి తక్కువ కాబట్టి.. ఆ పారితోషకం కాస్త ఎక్కువే. కాకపోతే క్రిష్ తో తెరకెక్కుతున్న సినిమా కోసమే పవన్ చేసే పనికి పారితోషకానికి సంబంధం లేదంటున్నారు. క్రిష్ సినిమా కోసం పవన్ చాలా కష్టపడాలట.
వకీల్ సాబ్ తో పోలిస్తే.. క్రిష్ సినిమాకి పవన్ పనిదినాలు ఎక్కువ వెచ్చించాలి.. అలాగే శారీరక శ్రమ ఉంటుంది. దీనితో పోలిస్తే పవన్ పారితోషకం ఏమంత ఎక్కువ కాదంటున్నారు. మొఘలాయిల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం. దాని కోసం.. పవన్ స్టయిల్ మార్చాలి. అలాగే సినిమా కోసం భారీ బడ్జెట్ అవుతుంది. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ ఆఖరుకి లుక్ చేంజ్ చేయలేదు.. అలాగే ప్రిపేర్ కూడా కాలేదు. కానీ క్రిష్ సినిమాకి పవన్ మేకోవర్, ఆయన హెయిర్ స్టయిల్, బాడీ లాంగ్వేజ్, అలాగే మేకప్, దుస్తులు అన్ని విషయాల్లో పవన్ కష్టపడాలి. అలాగే దిల్ రాజు దగ్గర తీసుకునే పారితోషకంతో పోలిస్తే ఏ ఏం రత్నం దగ్గర పవన్ కాస్త చూసి పారితోషకం తీసుకుంటున్నాడట. ఎందుకంటే ఎప్పటినుండో పవన్ వెనకాలే తిరుగుతున్నాడు రత్నం కాబట్టి. పాపం పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి.. పవన్ డబ్బు కోసమే సినిమాలు తీసున్నాడంటూ ఆడిపోసుకున్నారు అంతా. కానీ దానివెనుక పవన్ కష్టం గుర్తించలేకపోయారు.