Advertisement
Google Ads BL

ప్రస్తుతం పవన్‌తో సినిమా అంటే అంతే మరి..!


పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంలో నిర్మాతలు ఇప్పుడు వరసగా కక్కలేక మింగలేక ఉన్నారు. పవన్ క్రేజ్‌తో పని జరుగుతుంది. బోలెడన్ని లాభాలు వెనకేసుకోవచ్చు అని కలలు కని పవన్ తో ప్రాజెక్ట్స్ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ ఏమో రాజకీయాలకు ఇచ్చిన ప్రాముఖ్యం సినిమాల విషయంలో ఇవ్వడం లేదు. సినిమాలపై శ్రద్ద లేకుండా చేస్తున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ వ్యవహారం. ఇక దిల్ రాజు, పవన్ కళ్యాణ్‌తో సినిమా విషయంలో ఏదో అనుకున్నాడు కానీ ఇప్పుడు తడిసిమోపుడవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో షూటింగ్ కోసం ఫ్లైట్ ఎరేంజ్మెంట్స్ చేసిన దిల్ రాజు ఇప్పుడు పవన్ కోసం భారీగా ఖర్చులు పెడుతున్నాడట.

Advertisement
CJ Advs

అది కూడా పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ రూపంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడు. సో పవన్ కి సెక్యూరిటీ అవసరం అందుకు. ఇక మరో నటుడు కోసం కూడా దిల్ రాజు సెక్యూరిటీ కోసం బడ్జెట్ వెచ్చిస్తున్నాడట. పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ లో నటిస్తున్న ప్రకాష్ రాజ్ కూడా రాజకీయ నాయకుడు కావడం, ఈమధ్యన రాజకీయాలతో యాక్టీవ్ గా ఉంటూ అధికార పార్టీ నేతలను విమర్శిస్తూ ఉండడంతో ప్రకాష్ రాజుకి థ్రెట్ ఉండడంతో ప్రకాష్ రాజ్ వకీల్ సాబ్ షూటింగ్ కి వచ్చినప్పుడు  దిల్ రాజే స్వయంగా సెక్యూరిటీ ఎరేంజ్మెంట్స్ చూస్తున్నాడట. మరి పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ లాయర్ గా ప్రకాష్ రాజ్ వదిస్తాడట. పవన్ కళ్యణ్ - ప్రకాష్ రాజ్ కాంబో సీన్స్ కోర్టు సీన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక పవన్ తో ఇతర నిర్మాతలు కూడా దిల్ రాజు వలె సెక్యూరిటీ గట్రా ఎగస్ట్రాగా చూసుకోవాల్సిందే. మరి పవన్ క్రేజ్ తో లాభాలేమో గాని పవన్ తో సినిమా అంటే కామెడిగా ఉంది అంటున్నారు.

Pawan Vakeel Saab Latest Update:

Dil Raju Spends Money for Pawan and Prakash Raj Security
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs