Advertisement
Google Ads BL

వరుణ్ తేజ్ సినిమాలో కన్నడ స్టార్..?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అతడు ప్రత్యేకంగా బాక్సింగ్ లో కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఒకానొక కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రని తీసుకోవాలని చూస్తున్నారట. పాత్ర పరంగా ఉపేంద్ర అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు అతన్ని సంప్రదించాలని చుస్తున్నారట. 

Advertisement
CJ Advs

అయితే ఉపేంద్ర గతంలో కొన్ని తెలుగు సీనిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. ఆయన చివరగా తెలుగులో నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి.  ఆ సినిమా తర్వాత చాలా మంది దర్శకులు తమ సినిమాల్లోని ప్రత్యేక పాత్రల్లో నటించమని కోరినప్పటికీ ఆయన ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. మరి ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఒప్పుకుంటాడా అనేది సందేహమే. కాకపోతే ఉపేంద్ర వరుణ్ తేజ్ సినిమాలో పాత్ర చేస్తే ఆ సినిమా వెయిట్ డెఫినెట్ గా పెరుగుతుంది. మరి ఉపేంద్ర నటించడానికి ఒప్పుకుంటాడా లేదా  అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

Kannada star in varun Tejs movie:

Kannada star Upendra in varun Tejs movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs